పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/102

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ 100/G100 (1ఏ) ఈ చట్టము యొక్క నిబంధనలకు భంగము వాటిల్లకుండా లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు విద్యుచ్ఛక్తి యొక్క అట్టి చౌర్యమును కనిపెట్టిన మీదట, వెంటనే విద్యుచ్ఛక్తి సరఫరాను తొలగించవచ్చును.

అయితే, సముచిత కమీషనుచే ఇందునిమిత్తం ప్రాధికారమీయబడిన లైసెన్సుదారు లేదా సరఫరాదారు యొక్క అట్టి అధికారి మాత్రమే లేదా ఆవిధంగా ప్రాధికారమీయబడిన హోదాకన్న ఎక్కువ హోదాగల లైసెన్సుదారు లేదా సందర్భానుసారము సరఫరాదారు యొక్క లేదా ఎవరేని ఇతర అధికారి విద్యుచ్ఛక్తి యొక్క సరఫరా లైను తొలగించవలెను.

అంతేకాకుండా, లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు యొక్క అట్టి అధికారి, అట్టి నేరము జరిగిన దానికి సంబంధించి వ్రాతమూలకముగా అట్టి తొలగింపు జరిగిన సమయము నుండి ఇరవై నాలుగు గంటల లోపల అధికారితా పరిధి కలిగి ఉన్న పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయవలెను.

అంతేకాక, లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు ఈ చట్టము యొక్క నిబంధనలననుసరించి అంచనా వేసిన మొత్తము లేదా విద్యుచ్చక్తి ఛార్జీలను డిపాజిటు లేదా చెల్లించిన మీదట, ఈ ఖండము యొక్క రెండవ వినాయింపులో నిర్దేశించ బడిన విధంగా ఫిర్యాదు చేయాలనే బాధ్యతకు భంగము వాటిల్లకుండా అట్టి డిపాజిటు లేదా చెల్లింపు జరిగిన నలభై ఎనిమిది గంటల లోపల విద్యుచ్ఛక్తి యొక్క సరఫరాలైనును పునరుద్దరించవలెను.

(2) రాజ్య ప్రభుత్వముచే ఈ విషయమున ప్రాధికార మీయబడిన లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారు యొక్క ఎవరేని అధికారి-

(ఎ) విద్యుచ్ఛక్తి అప్రాధీకృత ఉపయోగం జరిగినదని లేదా జరుగుతున్నదని అతను నమ్ముటకు తగిన కారణమున్న ఏదేని స్థలము లేదా ఆవరణలో ప్రవేశింఛ వచ్చును, తనిఖీ చేయవచ్చును. మరియు " బద్దలుకొట్టి మరియు సోదా చేయవచ్చును.

(బి) విద్యుచ్ఛక్తి ఆప్రాధీకృత ఉపయోగమునకు వాడిన లేదా వాడుతున్న అన్ని అట్టి డివైజులు (ఆకృతులు) పరికరాలు, వైర్లు మరియు ఏదేని ఇతర సౌకర్య సాధనం లేదా వస్తువును సోదా చేయవచ్చును, అభిగ్రహించవచ్చును మరియు తొలగించ వచ్చును;