పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/100

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


________________ 98/G98 134. పారిశ్రామిక వివాదముల చట్టము, 1947లో లేదా తత్సమయమున అమలు నందున్న ఏదేని శాసనములో ఏమి ఉన్నప్పటికిని మరియు ఈ చట్టములో చేసిన నిబంధనల కొరకు తప్ప, 133వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లో నిర్దేశించబడిన అధికారుల మరియు ఉద్యోగుల యొక్క ఉద్యోగ బదిలీ, ఈ చట్టము క్రింద లేదా అంతరణ పథకములో నిబంధించబడినట్లు తప్ప ఏదేని ఇతర కేంద్ర లేదా రాజ్య శాసనము క్రింద ఏదేని నష్టపరిహారము లేదా చెరుపులకు అట్టి అధికారులు మరియు ఉద్యోగులు హక్కు కలిగియుండరు.

భాగము - 14

అపరాధములు మరియు శాస్త్రులు.

135 (1) విద్యుచ్ఛక్తి సంగ్రహించుటకు లేదా వినియోగించుటకు లేదా ఉసయోగించుటకు దురుద్దేశంతో, ఎవరైనా -

(ఎ) లైసెన్సుదారు లేదా సందర్భానుసారముగా సరఫరాదారుల యొక్క ఉపరితల, భూగర్భ లేదా అడుగున ఉన్న నీటి లైన్ల లేదా కేబుళ్ల లేదా సర్వీసు వైర్లు లేదా సర్వీసు సదుపాయములతో ఏదేని జోడింపును వినియోగించిన, చేసిన లేదా చేయుటకు కారణమగునో, లేదా

(బి) మీటరును అక్రమముగా మార్పుచేయుట, అక్రమముగా మార్పు చేసిన మీటరును అమర్చుట లేదా ఉపయోగించుట, కరెంటు మళ్లింపు ట్రాన్స్ ఫార్మరు, కచ్చితమైన లేదా సరియైన రిజిస్ట్రేషనులో జోక్యము చేసుకొను లూపు జోడింపు లేదా ఏదేని ఇతర డివైజు (ఆకృతి) లేదా పద్ధతి పరిమాణ మాపకం లేదా విద్యుచ్ఛక్తి మీటరును ఏర్పాటు చేయుట లేదా ఇతరవిధంగా చేయుట వలన, ఎక్కడైతే విద్యుచ్ఛక్తి చౌర్యము చేయబడుటకు లేదా వ్యర్ధమగుటకు కారణమగునో; లేదా

(సి) విద్యుచ్ఛక్తి మీటరు ఉపకారణాలు, సామగ్రీ లేదా వైరును చెరుపు లేదా ధ్వంసములు కలిగించునో లేదా సరియైన లేదా కచ్చితమైన విద్యుచ్ఛక్తి మీటగును ఏర్పాటు చేయుటలో జోక్యము విషయమై ఆవిధంగా చెరుపు లేదా ధ్వంసము చేయుటకు వారిలో ఎవరైతే కారణమగునో లేదా అనుమతించునో, లేదా

(డి) అక్రమముగా మార్పు చేసిన మీటరు ద్వారా విద్యుచ్ఛక్తి వినియోగించిన; లేదా

(ఇ) ప్రాధికరమివ్వబడిన విద్యుచ్ఛక్తి వినియోగము కొరకు కానట్టి, ఇతర ప్రయోజనము కొరకు విద్యుచ్చ క్తిని సంగ్రహించిన లేక వినియోగించిన లేక ఉపయోగించిన వారు మూడు సంవత్సరముల కాలావధి పాటు పొడిగింపగల కారాగార వాసముతోను లేదా జుర్మానా తోను లేదా రెంటితోను శిక్షింపబడుదురు: .