పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

971 697 (బి) "కంపెనీ" అనగా ఈ భాగము క్రింద పధకము ప్రకారం ఉత్పాదకత, లేదా ప్రసారము లేదా పంపిణీని చేపట్టుటకు కంపెనీల చట్టం, 1956 క్రింద స్థాపించబడి రిజిస్టరు అయిన కంపెనీ అని అర్ధము;

132. సముచిత ప్రభుత్వము యొక్క స్వంతమైన లేదా నియంత్రితమైన బోర్డు లేదా ఏదేని వినియోగము ఏదేని రీతిలో సముచిత ప్రభుత్వముచే స్వంతముకాని, లేదా నియంత్రణలో లేని వ్యక్తికి అమ్మిన లేక అంతరణ చేసిన సందర్భంలో అట్టి అమ్మకము లేదా అంతరణ నుండి వచ్చిన రాబడులను ప్రాధాన్యతా క్రమంలో అన్ని ఇతర బకాయిలకు ఈ క్రింది వరుసలో ఉపయోగించవలెను, అవేవనగా;-

(ఎ) పైన పేర్కొనిన అమ్మకము లేదా అంతరణచే ప్రభావితమైనట్టి బోర్డు లేదా వినియోగము యొక్క అధికారులు మరియు ఉద్యోగులకు చెల్లించవలసిన బకాయిలు (పదవీవిరమణ ప్రయోజనముల బకాయిలతో సహా);

(బి) ప్రస్తుతమున్న ఋణ ప్రసంవిధాల ద్వారా అంతరణ కర్త యొక్క అప్పు లేదా ఇతర దాయిత్వము అవసరమైనంత మేర చెల్లించుట.

133.(1) రాజ్యప్రభుత్వము, 131వ పరిచ్ఛేదము క్రింద నిబంధించబడినట్టి అంతరణ స్వీకర్త ఆస్తులు, హక్కులు మరియు దాయిత్వములను నిహితమొనర్చిన మీదట అంతరణ పథకము ద్వారా అధికారులు మరియు ఉద్యోగులను అంతరణ స్వీకర్తకు అంతరణ కొరకై నిబంధించవచ్చును.

(2) అంతరణ పథకము క్రింద అట్టి అంతరణ జరిగిన మీదట, అంతరణ పథకము ప్రకారము నిర్ధారించినట్టి నిబంధనలు మరియు షరతులపై ఆంతరణ స్వీకర్త అధీనంలో ఉన్న సిబ్బంది పదవిని లేదా సర్వీసును కలిగియుండవలెను.

అయితే, అంతరణ జరిగిన పిమ్మట అట్టి నిబంధనలు మరియు షరతులు, అంతరణ పనులు పథకము క్రింద అట్టి అంతరణ జరగని యెడల, వారికి వర్తింప జేయదగిన వాటి కంటే ఏవిధంగాను తక్కువ అనుకూలమైనవి కావు.

అంతేకాక, నిర్ణీతపరచబడిన కాలానికి అంతరణ తాత్కాలికమైనది.

విశదీకరణ

:- ఈ పరిచ్చేదము మరియు అంతరణ పథకము నిమిత్తము, "అధికారులు మరియు ఉద్యోగులు" అనుపద బంధమునకు పథకములో నిర్దిష్ట పరచబడిన తేదీన బోర్డు లేదా సందర్భానుసారంగా అంతరణకర్త యొక్క అధికారులు మరియు ఉద్యోగులైన అందరు అధికారులు మరియు ఉద్యోగులు అని అర్ధము.