పుట:విద్యుచ్ఛక్తి చట్టము, 2003.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

________________

1997 699 అయితే, సంగ్రహించబడిన లేదా వినియోగింపబడిన లేదా ఉపయోగింపబడిన లేదా సంగ్రహించడానికి ప్రయత్నించిన లేదా వినియోగించు కోవడానికి యత్నించిన లేదా ఉపయోగించుకోవటానికి ప్రయత్నించిన లోడు,

(i) 10 కిలోవాట్లకు మించని యెడల, మొదటి దోష స్థాపన పై విధించిన జుర్మానా అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభము నకు మూడు రెట్లకు తక్కువ కాకుండ ఉండవలెను మరియు రెండవ లేదా తదుపరి తరువాతి దోష స్థాపన విషయంలో విధించిన జుర్మానా అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభమునకు ఆరు రెట్లకు తక్కువ కాకుండా ఉండవలెను.

(ii) 10 కిలోవాట్లకు మించిన యెడల, మొదటి దోష స్థాపన పై విధించిన జుర్మానా, అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభమునకు మూడు రెట్లకు తక్కువ కాకుండ ఉండవలెను. మరియు రెండవ లేదా తదుపరి తరువాతి దోష స్థాపన విషయంలో ఆరు మాసములకు తక్కువ కాకుండా అయితే ఐదు సంవత్సరముల దాకా మన పొడిగింపగల కారావాసముతోను మరియు అట్టి విద్యుచ్ఛక్తి చౌర్యము ద్వారా పొందు విత్తీయ లాభమునకు ఆరు రెట్లకు తక్కువ కాని జుర్మానాతోను శిక్షింపబడవలెను.

అయితే ఇంకనూ, 10 కిలోవాట్లకు మించిన లోడును సంగ్రహించబడిన, వినియోగింప బడిన, లేదా ఉపయోగింపబడిన లేదా సంగ్రహించడానికి ప్రయత్నించిన లేదా వినియో గించుకోవడానికి ప్రయత్నించిన లేదా ఉపయోగించడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తి రెండవ మరియు తదుపరి నేరారోపణ గావించిన సందర్భములో అట్టి వ్యక్తి కూడ మూడు మాసములకు మించనట్టి అయితే రెండు సంవత్సరముల వరకు ఉండగల కాలావధి వరకు ఏదేని విద్యుచ్ఛక్తి సరఫరాను పొందు హక్కును కోల్పోవును మరియు ఏదేని ఇతర వనరు లేదా ఉత్పాదన స్టేషన్ల నుండి ఆ కాలావధి వరకు విద్యుచ్ఛక్తి సరఫరాను పొందుట నుండి కూడ హక్కును కోల్పోవును.

అంతేకాక, వినియోగదారు. విద్యుచ్ఛక్తిని సంగ్రహించడం, వినియోగించుకోవడం లేదా ఉపయోగించుకోవడం కొరకుగాను బోర్డు లేదా లైసెన్సుదారుచే లేదా సందర్భానుసారము. సరఫరాదారుచే ప్రాధికార మీయబడని ఏదేని కృత్రిమ సాధనాలు లేదా సాధనాలు ప్రస్తుతము ఉన్నాయని నిరూపితమైనచో, ఆ ఉల్లంఘన నిరూపించబడునంత వరకు విద్యుచ్ఛక్తి యొక్క ఏదేని సంగ్రహణ. వినియోగము లేదా ఉపయోగము అట్టి వినియోగదారు చే దురుద్దేశము వలన కలిగినదని పురోభావన చేయవచ్చును.