పుట:విక్రమార్కచరిత్రము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

7


వ.

అనిసంభావించి.

25


కావ్యకరణ హేతువు

తే.

వనము నిధియును నల్లిల్లు వరసుతులును,
జెఱువు గుడియును ధరఁ బ్రతిష్ఠితములయ్యె
గృతియుఁ గైకొన్న సప్తసంతతులవలనఁ,
గీర్తిసుకృతంబులకును నేఁ గర్త నగుదు.

26


సీ.

ప్రతిభాగుణధురీణ పౌరాణికత్రాణ
        సకలపురాణశాస్త్రములయందు
బరమార్థ చరితార్థ భారతరామాయ
        ణాదిప్రబంధకావ్యములయందుఁ
గల్పాంతరస్థాయి గద్యపద్యప్రాయ
        కమనీయచిత్రకావ్యములయందు
రసికజనానందరససుధానిష్యంద
        విలసితనాటకావలులయందు


తే.

సకలదేశభాషావిశేషములయందు
వరునఁ బ్రఖ్యాతమనఁగ నుత్పాద్యమనఁగ
మిశ్రమన నొప్పు సత్కథామేళనంబు
లెన్నియన్నియు విన్నాఁడఁ బిన్ననాఁడ.

27


చ.

[1]తలఁపఁ దదీయనాయకవితానముకంటెను, సాహసక్రియా
కలితవదాన్యతాది గుణగౌరవరేఖల విక్రమార్కభూ
తలపతి యెక్కుడై నెగడెఁ దచ్చరితంబుఁ బ్రబంధశయ్యగాఁ
దెలుఁగున చెప్పి, యాకృతిపతిత్వము మా కొడఁగూర్పు నేర్పునన్.

28


వ.

అని సవినయంబుగాఁ గనకమణిభూషణాంబరతాంబూలంబు లొసంగి గారవించినం బ్రమోదించి, తత్ప్రబంధమునకు ముఖాకల్పంబుగా, నాప్రధానోత్తము వంశంబుఁ బ్రశంసించెద.

29
  1. తలఁపఁ దదీయ యేకకవితానముకంటెను....అని వావిళ్ల. 1926.