పుట:విక్రమార్కచరిత్రము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్ణనాబాహుళ్యము చేతఁ గుమారసంభవ, నృసింహపురాణములును, ప్రౌఢశైలీవిన్యాసముచేతను శబ్దార్ధాలంకారబహుళవర్ణనాచమత్కారముచేత నుత్తరహరివంశమును; ఏకైకరాజనాయకత్వశృంగారరసప్రాధాన్యములచేత, కేయూరబాహుచరిత్రమును బ్రబంధలక్షణవిలసితములు. ఈ విక్రమార్కచరిత్ర మన్ననో ఉపర్యుక్తసమస్తగుణలక్షితమై ప్రబంధశయ్యాగ్రథితమయిన ప్రబంధసామ్యకృతి. మనుచరిత్రాది ప్రబంధకావ్యరచనకు మార్గదర్శకములైన పూర్వకావ్యములలో విక్రమార్కచరిత్ర మొక్కటి. అట్టి ప్రబంధకవులకు మార్గదర్శకు ఆయిన పూర్వకవులలో ఏతద్విక్రమార్కచరిత్ర కర్తయగు జక్కన కవియు నొక్కఁడు.

కవికుల గోత్రాదులు

జక్కన నియోగి బ్రాహ్మణుఁడు. ఇతని తండ్రి అన్నయామాత్యుఁడు, తల్లి అక్కమాంట. తాత పెద్దయామాత్యుఁడు. స్వవిషయమున నీ కవి కృత్యవతారికలో నింతకు మించి విశేషము లెవ్వియుఁ దెలుప లేదు. విక్రమార్కచరిత్ర కృతిభర్త యగు సిద్ధనమంత్రి కులగోత్రాదుల నుగ్గడించెనే కాని, తన కుల మెద్దియో, గోత్ర మెద్దియో, సూత్ర మెద్దియో సుతరాము సూచింపలేదు. జక్కన యింటి పేరు 'పేరం రాజు' వారని, శ్రీ టేకుమళ్ళ అచ్యుతరావుగారు వ్రాసిరి కాని, దాని కాధారమును జూపరయిరి. అది మొదలు కొందఱు పేరంరాజు జక్కన యని వ్రాయుచున్నారు. ఇది యెంతవఱకు నిజమో విచార్యము. ఇట్లే పెద్దన తాత, తిరుకాళచోడునిచే సన్మానితుఁ డని జక్కన చెప్పిన దానినిఁబట్టి జక్కన కూడా నెల్లూరి పురవాసుఁడని యూహింపవచ్చునని అచ్యుతరావుగారు వ్రాసిరి. కాని జక్కన తాత కూడా నెల్లూరు వాస్తవ్యుఁడో, కాడో, నిజము మనకుఁ దెలియదు.

పండితకవి వంశము

జక్కన విద్వత్కవి. విద్యత్కవి వంశీయుఁడు. ఈ కవి తాతను గూర్చి ఈ క్రింది వివరములు అవతారిక (ఆ. 1-20)లోఁ దెలుపఁ బడినవి.

జక్కన తాత పెద్దయామాత్యుఁడు. గొప్ప పండితుఁడు, కవి. సంస్కృత ప్రాకృత శౌర్యసేన్యాది బహుభాషాకోవిదుఁడు. ఘటికామాత్రకాలములో బహుభాషలలో 'శతకము' జెప్పఁగలవాఁడు. ప్రహసన, భాణాది రూపకములు; చక్ర, చతుర్భద్ర, చతురుత్తరాధికక్షుద్రప్రబంధములు రచించు నేర్పరి. సకలరసములలో వర్ణనలు చేయు సమర్థుఁడు. ఏకసంధా, ద్విసంధా, త్రిసంధాగ్రహణపద్దతిని పద్యములను వినినంతనే ధారణ చేసి తిరిగి వినిపించుశక్తి గలవాఁడు. అన్నివిధముల అవధానములయందును నితరులను మించి యవధానము లొన