పుట:విక్రమార్కచరిత్రము.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95


వ.

అమ్మదనరేఖానందనుండును దనవమీపంబున సమాసీనయైన యనంగసేనం గనుంగొని.

13


క.

కూరిమి మీఱఁగఁ జేరం
జేరిచి, సర్వజ్ఞుకరుణఁ జేరె నటంచున్
ధారుణిసుపర్వుఁ డొసఁగె, న
పారతపోలబ్ద మైనఫల మిది మనకున్.

14


క.

[1]నరుఁ డొకఁ డిది సేవించిన
మరణ జరాదులు దొఱంగి మను సంపదలన్
అరు దిట్టిఫలము, గన నీ
పరిపక్వఫలంబు భాగ్యఫలము లతాంగీ!

15


క.

కావున నాకుఁ బ్రియంబుగ
నీ వీ ఫల మనుభవింపు, మిదె కొమ్మని సం
భావన నిచ్చినఁ గొని చని
యావనితయు నిచ్చెఁ గూర్చుహయపాలునికిన్.

18


క.

అమ్మందురకుఁడుఁ దద్గృహ
సమ్మార్జన కిచ్చె, సంతసంబున నదియున్
గ్రమ్మన గోపున కిచ్చెఁ, బ్రి
యమ్మున వాఁడును గరీషహారిణి కిచ్చెన్.

17


ఆ.

ఆలమందనుండి యది మఱునాఁడు ప్ర
త్యూషవేళఁ దాఁ గరీషపూర్ణ
వేణుపాత్రమీఁద వెలయఁ బం డిడుకొని
యాత్మగేహమునకు నరుగునపుడు.

18
  1. క. హరుకృపఁ గలిగినయది యిది
    ధరణీదేవుండు మనకు దయచేసినవాఁ
    డరు దెం దియ్యరుఫల మీ
    పరిపక్వఫలంబు భాగ్యఫలము లతాంగీ. అనీ పా.