పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

184

వరాహపురాణము


క.

ఆసంపద, లామానిని, | యాసుతు, లాబంధువర్గ మావైభవమున్
గాసిం బొందక నిలిచెనె? | [1]యీసం దెఱుఁగంగవలదె యిలఁ బ్రాజ్ఞునకున్?

228


క.

క్షణికస్వప్నం బగు నిది, | గణుతింపఁగ దీర్ఘకాలికస్వప్నం బ
ప్రణుతంబగు సంసారము, | గుణ మందును నిందు లేదు [2]కువలయనాథా!

229


తే.

పూర్వనిమిషంబులోఁ గన్న భోగసుఖము | వర్తమానక్షణంబున వసుమతీశ!
స్వప్నమై తోఁచు, స్వప్నసంజాతసౌఖ్య | మస్థిరము గాక నిత్యమే యరసి చూడ?

230


ఆ.

ఇదియె కాదు, తరువులెల్లను వంధ్యంబు | లయ్యె, నధ్వరంబు లణఁగిపోయె,
శుభవిహీన మగుచు శూన్యభావంబునఁ | గానుపించె నీజగత్త్రయంబు.

231


ఉ.

కావునఁ, బుత్రమిత్రధనకంజముఖీముఖవస్తుజాలమున్
భావములోన స్వప్నసుఖ[3]భాతి ననిత్యముగాఁ దలంపుచున్,
భూవరచంద్ర! దానమున భూసురబంధుహితార్థకోటి ని
చ్ఛావిధిఁ దన్పి, గైకొనుము శత్రుజయంబును నీతిశాలివై.

232


ఉ.

భవ్యదయాసుధాజలధి, భక్తశరణ్యుఁడు, శ్రీవిభుండు, మం
తవ్యుఁడుగా నెఱంగి, ప్రమదంబున నాజగదీశు దేవతా
సేవ్యుఁ దలంచి, పేర్కొని భజించి, నుతించి, నమస్కరించి, నీ
వవ్యయసౌఖ్యసిద్ధి గను మస్మదుదీరితవాక్యపద్ధతిన్.

233


ఉ.

నావుడు, దద్వశిష్ఠవచనంబున నిర్గతసంశయాత్ముఁడై,
భావమునన్ సతీతనయబంధుజనాశ్రితవిత్తమోహముం
బోవఁగఁబెట్టి, యా పరమపుణ్యులకుం బ్రణమిల్లి, హస్తముల్
దా విలసిల్ల మోడ్చి, యనుతాపము దోఁపఁగ వారి కిట్లనున్.

234


మ.

అరిషడ్వర్గవశంవదుండనయి, రాజ్యశ్రీతనూజాంగనా
తురగానేకపముఖ్యవస్తుపటలీదుర్మోహబంధుండనై,
సిరి నిత్యంబని విశ్వసించి, మది లక్ష్మీనాథపూజానమ
స్కరణస్తోత్రము లాచరింపక వృథా సంసారసంగంబునన్,

235


క.

భోగములఁ దవిలి, పాత్ర | [4]త్యాగ మొనర్పంగలేక హతమతి నగు నా
కేగతి పొందఁగవలయుఁ? ద | మోగుణరహితాత్ములార! మునివరులారా!

236
  1. యాసందెఱుగంగవలదె ప్రాజ్ఞున కెపుడున్ (యతి?) - మ, తి, తీ,హ,ర,క
  2. వసుధాధీశా (యతి?) - మా, తా: యవనీనాథా (యతి?) - త
  3. ఫక్కులు నిత్య - తీ; బారిన నిత్య - మ, తా,హ,ర,క
  4. త్యాగంబొనరింపలేక - తీ