పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

183


సీ.

పరిపాకగతి [1]మీఱఁ [2]జఱచెనో యన, దేహ | మెల్లను నరలచే దెల్లఁబాఱ,
[3]ద్విజములై, కానివి దినిన కీడును బోలె, | దంతంబు లిలఁ బతితములు గాఁగ,
ముదిమితొయ్యలి తన్నుఁ గదిసిన సాత్త్వికో | ద్గమ మయ్యెనో, యనఁ గంప మొదవఁ,
బ్రాయంబు గోల్పడఁ బటుశోకమునఁ బోలె | నేత్ర[4]గోళంబుల నీరు గ్రమ్మ,


తే.

వార్ధకం బను భూతంబు వచ్చి తన్ను | నలమినప్పుడు పుత్రకాంతాదిమోహ
పారవశ్యంబు వదలక పార్థివేంద్రుఁ | డుత్సుకత నుండె, నంతలో నొక్కనాఁడు.

222


చ.

కొడుకులు నాఁడుబిడ్డలును గోడలు కొమ్మలు పౌత్రవర్గమున్
దడయక చుట్టును న్మెలఁగఁ, దానును భార్యయు సమ్మదాశ్రులన్
జడిగొనఁ జూచుచున్నపుడు, సౌధతలంబునఁ గాలుజాఱి, యా
పడఁతుక గూలి యాక్షణమ ప్రాణవియోగము నందె, నందినన్,

223


తే.

భూవరేణ్యుండు సతిఁ జూచి, పొక్కిపడుచు | హా! పతివ్రత! హా! మనోహరశుభాంగి!
హా ! [5]ప్రియాంగన! ననుఁ బాయ [6]నగునె నీకు? | ననుచుఁ బలుమారు శోకించు నవసరమున.

224


క.

వెడ మాయఁ గనిన కలకై | యడలెడు భూపాలుచంద మారసి, నగుచుం
దొడ చఱచి, మేలుకొలిపిరి | తడయక యవ్విభుని మునులు దయ యిగురొత్తన్.

225


వ.

ఇట్లు మునివరప్రబోధితుండై, మయూరధ్వజుం డదరిపడి లేచి, ముహూర్తమాత్ర
స్వప్నంబునఁ జిరకాలానుభూతంబులగు సుఖదుఃఖంబుల కచ్చెరుపడి, యాస్థానంబుఁ గలయం
గనుంగొని, పశ్చాత్తాపంబున లజ్జా[7]నమితకంధరుండై , చిన్నవోయియుండె. ఆ సమయంబునఁ
గులగురుండగు వశిష్ఠమునీశ్వరుం డతని నాలోకించి, నగుమొగంబుతో నిట్లనియె.

226

జీవితములు స్వప్నానుభూతులు

తే.

తగునే నీ కిట్లు భూవరోత్తంస! మద్య | పానగోష్ఠియు, గోమాంసభక్షణంబు,
నధమమాతంగభామాసమాగమంబుఁ | బతితగృహభోజనముఁ జేయఁ బాప మనక?

227
  1. జఱ - ర,క; జూడ - మా,త
  2. జెఱచెనో - త, తా, తీ
  3. ద్విజనులై - తీ
  4. గోళంబు కన్నీరు - తి,తీ,హ,ర,క
  5. ప్రియా ననుఁ బాయఁగ - తీ
  6. దగునె (యతి?) - తీ. భిన్న ప్ర.
  7. సహితమానసుండై - క