పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

వరాహపురాణము


తే.

కాంచి, సంతోషపులకితగాత్రుఁ డగుచు | ధరణినాయకుఁ డాహయోత్తమము నెక్క,
సరస నదియు మనోవేగభరిత మగుచుఁ | జాఁగి, యెనుబదివేలయోజనము లరిగె.

188


చ.

జలధులు దాఁటి యిట్లు రభసంబున నేఁగుచునుండ, భూవరుం
డలయిక దోఁచిన న్వికలుఁడై, మధుసాగరతీరమందు, నూ
డలు గనుపట్టు నున్నతవటద్రుమ మొక్కటి చేరువైనఁ, ద
ద్విలసితశాఖ పట్టుకొని వ్రేలుచు, వాగెలపట్టు వీడినన్,

189


క.

తురగోత్తమ మెందేనియు | నరిగె, మహీవిభుఁడు కంపితాత్ముండై త
త్తరువు దిగివచ్చి, మూల | స్థిరవేదిక విశ్రమించి, చింతాపరుఁడై,

190


వ.

తన మనంబున,

191


చ.

కదిసిన [1]లోభశక్తిఁ, జిరకాల ముపార్జితమైన రాజ్యమున్,
సుదతులఁ, బుత్రులన్, హితుల, శూరుల, దంతిరథాశ్వభృత్యసం
పదలను బాపి [2]తెచ్చె విధి బాపురె! కుమ్మరి కొక్కయేఁడునున్
[3]గుదియకు నొక్కపెట్టు, నని కూర్చిన యానుడి నిక్కువంబుగన్,

192


సీ.

అని తలపోయుచు, నన్నరేంద్రుఁడు ఘన | క్షుత్పిపాసాకృతక్షోభుఁ డగుచు,
నుదకంబు నచ్చోట వెదకుచు, మణిసౌధ | దీపితంబైన మాయాపురంబు
నుపకంఠమునఁ గాంచి, నృపతి యాపురి చొచ్చి | యే యే గృహంబున కేఁగి చూచే
నాయాయి గృహమున [4]నలఁగక గోహత్య | లొనరింపుచున్న దుర్జనుల కర్మ


తే.

[5]మక్షి గోచర మగుటయు నాత్మ రోసి, | తెలియఁ జండాలపుర మిది, దీన నున్న
వారు, సంభాషణీయులు గారు నాకు, | జలము గ్రోలక ప్రాణంబు నిలువ, దింక
నెట్టు భుజియింప మది కింపు పుట్టు నిచట?

193


క.

విధివశమున నా కిచ్చట | నధమగతిం జిందవలసె, నని శోకరసాం
బుధిఁ దేలి తేలి, క్రమ్మఱ | నధిపతి వటతరువుకడకు నరిగినయంతన్,

194
  1. మోహ - తి తీ
  2. తెచ్చితివి - తి తీ
  3. గుదె కొకపెట్టు నాఁగ - తి తీ
  4. నలయిక . తీ
  5. ఇందలి యెత్తుగీతి పంచపాది