పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

వరాహపురాణము


తే.

వందనము చేసి కరపల్లవములు రెండు | ఫాలమునఁ గూర్చి వినయసంపన్నుఁ డగుచు
నామయూరధ్వజాహ్వయభూమిభర్త | మధురభాషల నిట్లను మౌనితతికి.

169


క.

అప్రాజ్ఞుల మాదృశులను | క్షిప్రంబునఁ గుశలమతులఁ జేయుటకై , తా
[1]రప్రార్థనీయు లయ్యును | విప్రులు చనుదెంతు రుదితవిహరణవాంఛన్.

170


క.

మీపాదరజము సోఁకినఁ | బాపంబు దొలంగుఁ, బుణ్యఫల మబ్బు, మన
స్తాపములు వాయు, శుభములు | చేపడు, నెటువంటి దుష్టచిత్తున కైనన్.

171


చ.

ధనమణిభూషణాంబరవితానము లొల్లక, నిస్పృహాత్ములై
వనముల నుండు మీ రిటకు వచ్చుటఁ జేసి, ఫలించె మత్పురా
తనసుకృతంబు, నాకు నుచితంబుగ నే నొనరించునట్టి యా
పని వినిపింపుఁ డెద్ది? దృఢభావమునన్ సమకూరు నిష్టమున్.

172


వ.

అనిన మయూరధ్వజునకు వశిష్ఠాదిమును లిట్లనిరి.

173


క.

విజయో౽స్తు తే, మయూర | ధ్వజ ధాత్రీనాథ! ఖండితద్వేషినృప
వ్రజ! రాజలక్షణోజ్జ్వల! | భుజవిక్రమశోభమాన1భోగసురేంద్రా!

174


ఉ.

అసలు గోసి, యింద్రియ[2]హయంబుల వాగెఁ గుదించి, కాననా
వాసులమైన మాకు నొకవస్తువుపై నభిలాష పుట్టినన్,
వాసవభోగ! చేతి కది వచ్చిన దాఁకఁ, దదీయవాంఛ దా
నోసరిలంగఁదేర, దను వొందునె వాంఛ జయింప నేరికిన్?

175


క.

ఆశావాంఛలు సరియగు | నాశతధృతికైన, నస్మదాదులకైనన్,
ధీశక్తిని నారెంటిని | నాశము నొందించు టరిది నరనాథమణీ!

176


క.

ఏయర్థము దన కీప్సిత | మాయర్థము హస్తగామి యగునట్లు బహూ
పాయముల మెలఁగఁ డెవ్వఁడు, | వాయుప్రేరితశవంబు వాఁడు నరేంద్రా!

177


క.

[3]విడిముడి గలిగియు నొరులకు | నిడనేరక, యనుభవింపనేరక మదిలో
నుడుగని లోభము దాల్చిన | గడుసరి, జీవన్మృతుండు గాఁడె తలంపన్?

178
  1. రప్రార్థితు లయ్యు మహా - త. కంటె భిన్న ప్ర.
  2. చయంబుల - మ, తి,తీ,హ,ర,క
  3. ఈ ప. తా ప్ర. లో లుప్తము