పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

171


వ.

అట్టి యతిథికి ఋషభాసతియందు [1]నిషధుండగు కుశేశయుం డుదయించె. అతనికి
[2]వాసవియతి యను భామయందు నలుండు సంభవించె అన్నరేంద్రునకు నభుండు,
నమ్మహీపతికిఁ బుండరీకుండు, నానృపాలునకు క్షేమధనుండు, నాభూభర్తకు వశంవదుండు,
నాధరణీధవునకు నహీనజుండు, నారాజచంద్రునకుఁ బారియాత్రుండు, నాజనపాలునకుఁ
బద్మకాంతయందు శీలుండు, నానృపోత్తమునకు సునాభుండు, నాక్షోణీవిభునకు వజ్రుండు,
నారాజన్యునకు శంఖుండు, నాపార్థివునకు హరిదశ్వుండును గ్రమంబున జనియించిరి,
ఆహరిదశ్వుండు భుజాబలంబున సమరతలంబుల ననేకరిపుకులంబులం బొలియించి,
హయమేధాది వివిధాధ్వరంబు లొనర్చి, దీప్త యను భార్యయందు విశ్వసహుండను
తనూభవుని గనియె. అతనికి హిరణ్యనాభుండు వొడమె. ఆమండలేశ్వరునకుఁ గౌసల్యుం
డవతరించె. ఆమహాత్మునకు సోమనృపాలుం డుద్భవించె. ఆక్షత్రియోత్తమునకు బ్రహ్మిష్ఠుం
డుత్పన్నంబయ్యె. ఇట్లు మహావీరులగు సూర్యవంశసంభవు లనేకులు గలరు. అట్టి సూర్య
వంశంబు చతుర్వింశతిభేదంబులం బ్రవర్తించె. ఇంక , సోమవంశప్రకారంబు వివరించెద
నాకర్ణింపు మని రోమశుం డిట్లనియె.

144

చంద్రవంశప్రశస్తి

సీ.

శిరసుపు వ్వంబికాజీవితేశ్వరునకు, | నిందిరాధవునకు నెడమకన్ను,
వాకట్టు [3]బదనికవనరుహశ్రేణికి, | [4]నమృతాశనులకు నాహారఘటము,
గారాపుఁగొమరుండు కలశవారాశికిఁ, | గలిమిచేడియకు డగ్గఱినతోడు,
మొగసిరిమందు చెందొగ [5]మొత్తమునకును, | జారచోరులకు నంగారవృష్టి,


తే.

విరహులకుఁ [6]బెట్టు, చలువకు [7]విడిదిమట్టు | తిమిరములనెవ్వ, [8]శిశుచకోరముల బువ్వ,
మన్మథుని మామ, కాంతిసంపదలసీమ, | చంద్రుఁ డొప్పారుఁ గౌముదీసాంద్రుఁ డగుచు.

145


ఆ.

అతనివలనఁ బుట్టి రనురూపతేజులు | పుష్యరథుఁడు దముఁడు పూరువుండు
దర్శనుండు వజ్రదంత సహాఖ్యులు | జిత్రుఁ డార్యకుండు జిత్రకుండు.

146


వ.

అందు,

147
  1. నిషండు - మా,తీ,ర
  2. వాసవ - తీ,హ
  3. నదెనిదె - మ,హ; వదినికె - మా,త; నదెవిదె - తా; వికసిత - తి, తీ; మరియును - క
  4. నమృతాంధసులకు - మా
  5. రత్నము - తి,తీ
  6. బెట్ట - తా
  7. విట్టిమట్టు - మ; వీటిమట్ట - తా: బిట్టుమట్టు - తి, తీ; విట్టిమట్టి - హ; వింటిమట్టు - క
  8. నాచకోర - తా