పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

వరాహపురాణము


క.

చనుదెంచి, యాశ్రమాంతిక | మున వల్మీకజుఁడు గాంచె, మోహనకంఠ
స్వనజితపికసంఘాతను, | జనలోకఖ్యాత, నవనిజాతన్, సీతన్.

137


తే.

[1]ధరణిపతితను, ధూళిదూసరితగాత్రిఁ | బూర్ణగర్భసమన్వితఁబొలఁతి నిట్లు
గాంచి, కరుణారసం బాత్మఁ గడలుకొనఁగ, | మునిశిఖామణి యాయిందుముఖికి ననియె.

138


క.

వనితా! యెవ్వని భార్యవు? | వనమున నిను డించి చనినవాఁ డెవ్వఁడు? నీ
వొనరించిన తప్పెయ్యది? | వినిపింపుము వికసితారవిందనిభాస్యా!

139


వ.

అని పలికిన మునికులోత్తంసునకు నాహంసగమన యిట్లనియె.

140


ఉ.

భూజనయిత్రికన్, జనకపుత్రిక నే, నతిలోక[2]పుణ్యుఁ డా
రాజకులాగ్రగణ్యుఁ డగు రాముని భార్య, నతండు విశ్వధా
త్రీజనదుష్ప్రవాదము భరింపక, లక్ష్మణు నంప, నమ్మహా
తేజుఁడు నన్నుఁ దెచ్చి, వనదేశమునన్ దిగనాడిపోయినన్,

141


మ.

వగలం గుందుచునున్నదాన ననినన్ వాల్మీకి యుద్యత్కృపా
స్థగితుండై, తనయాశ్రమంబునకు నాసాధ్వీమణిం దెచ్చి, పొం
దుగఁ బోషింపఁగ, [3]నంతలో యమళపుత్రుల్ సన్ముహూర్తంబునం
దోగి జన్మించిరి సీతకుం గుశలవాఖ్యుల్ భూరితేజస్కులై.

142


చ.

సుతయుగళంబులోఁ బ్రథమజుండగునట్టి కుశుండు తాఁ గుశా
వతి యను వీడొనర్చి గరువంబున [4]రాజ్యము సేయుచుం, గుము
ద్వతి యను భామఁ బెండ్లియయి, తత్సతితోడ నయోధ్య కేఁగి, యం
దతిథిసమాహ్వయుం డగు వరాత్మజుఁ గాంచె గుణాభిరామునిన్.

143
  1. ధరణిపతి తన్ వృథా వనస్థలి వసింపఁ | బంప, శోకాకులత గళద్బాష్పయౌచు, డిల్లపడి రక్షణాశఁ దన్నల్లఁ జూడ - తీ; ధరణిపతియగు రాముని విరహతాప | మునను సోలుచు నెవ్వగ మునిఁగియున్న | ధరణిసంజాతఁ గనుఁగొని తలఁకు నొంది - హ; ధరణిసుతఁ దనుధూళి - క; ర. ప్ర. లో, దుది పా. మాత్రము కలదు.
  2. పుణ్యుఁడౌ - మా,త, తా,హ,ర
  3. నంతలోనఘన - మ; నంతలోనయమ - తా
  4. సద్వతిఁ బెండ్లియై మహా | రతిశతభోగము ల్దనిపి రమ్యపురాకృతపుణ్యరాశియం | దతిథి - మ; రాజ్యము దాలిచెం గుముద్వతి - తీ