పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

169


మ.

ప్రభవంబందె ననంతరంబున దిలీపక్ష్మాధవుం, డమ్మహీ
విభురత్నంబునకున్ సుదక్షిణకు నావిర్భూతుఁ డయ్యెన్ రఘు
ప్రభుఁ, డాతండు మఖాశ్వరక్షణ మొనర్పం బిత్రనుజ్ఞాతుఁడై
రభసం బొప్పఁగ సంచరించునెడ, సుత్రాముండు తద్వాహమున్,

130


ఆ.

అపహరించి చనిన నమరేంద్రు వెన్నంటి | యంపవెల్లి నతని యదటణంచి,
గెలిచినట్టి రఘువు గలుగుట, రఘువంశ | మనఁగఁ బరగెఁ దన్నృపాన్వయంబు.

181


ఉ.

అట్టి రఘుక్షమాపతికి నాత్మజుఁడై యజుఁ డుద్భవించి, యి
టట్టనరాని [1]విక్రమత నాధర యేలుచునుండె, నాజగ
త్పట్టణభర్తకున్, దశరథక్షితిపాలుఁడు పుత్రరత్నమై
పుట్టి తనర్పె, సర్వనృపపుంగవమౌళికిరీటసేవ్యతన్.

132


చ.

హరిమదహర్త కాదశరథావనిభర్తకుఁ బుత్రులై జనిం
చిరి మఖశక్తిఁ జేసి, హరిశేషసుదర్శనపాంచజన్యభా
సురతరతైజసాంశముల శూరులు రాముఁడు, లక్ష్మణాఖ్యుఁడున్,
భరతుఁడు, శత్రుహంతయు ననంగ మహాత్ములు నల్వు రెన్నఁగన్.

133


ఉ.

ఆమహనీయవిక్రములయందును, బూర్వజుఁడైన సద్గుణా
రాముఁడు, వైరివైభవవిరాముఁడు, రాముఁడు గాధినందనో
ద్దామమఖంబు గాచి, హిమధామకిరీటునివిల్లు ద్రుంచి, సీ
తామహిళావివాహసముదంచితుఁడై, తదనంతరంబునన్,

134


ఉ.

రావణముఖ్యరాక్షసపరంపరలం దునుమాడి, జానకీ
దేవియుఁ దా నయోధ్య కరుదెంచి, సుఖస్థితిఁ గ్రీడసల్పుచున్
భూవలయాధిపత్యమునఁ బొంగుచునుండి, [2]మహీజనాపవా
దా[3]విలవాక్యము ల్విని, ప్రియాంగన నంపె నరణ్యభూమికిన్.

135


మ.

లలనారత్నము సీత, దుష్టమృగజాలవ్యాప్తఘోరాటవిన్
బలవద్గర్భభరాలసాంగి యగుచుం బ్రాణేశ్వరుం [4]జీరుచుం
గలకంఠీకలకంఠపంచమకుహూకారానుకారధ్వనిం
బలవింప న్విని, చేరవచ్చెఁ గరుణం బ్రాచేతసుం డుల్కుచున్.

136
  1. విక్రమమునంధర (యతి?) - అన్ని ప్ర
  2. మహీ(ధవుండు మిథ్యావృతనింద)ల న్విని - తీ
  3. వళిగాంచి భూమిజను దప్పకనంపె - మ
  4. దూఱుచుం - మా, త, తా