పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

168

వరాహపురాణము


తే.

ఉరగలోకంబు వెదకుట కుద్యమించి, | పటుఖనిత్రాగ్రముల ధాత్రిఁ బాయఁ ద్రవ్వి,
జలధిమార్గంబునను రసాతలము సొచ్చి, | కపిలమునిపొంత మఖఘోటకంబుఁ గాంచి,

122


చ.

వెనుక హయంబుఁ గట్టుకొని, [1]వీఁడె [2]యథార్థతపస్వికైవడిన్
గనుగవ మూసినాఁడు, పొడగంటిమి గుఱ్ఱపుదొంగ నంచు, నా
మునివరు ముష్టిఘాతముల మోదిన, నాఘను రోషవహ్ని లో
చనముల [3]వెళ్ళి, యాసగరజాతుల భస్మము చేసె నందఱన్.

123


ఉ.

అంత, భగీరథుండను మహాత్ముఁడు తత్కులమందుఁ బుట్టి, య
త్యంతతపోగతిన్, శివుఁ బురాంతకుఁ బ్రీతునిఁ జేసి, యాయుమా
కాంతు జటానుషంగ యగుగంగ, నభంగురభంగఁ, [4]బాపజా
లాంతకరప్రసంగఁ బ్రియ, మారఁగఁ దెచ్చిన, నాస్రవంతియున్,

124


తే.

తరుణ[5]శశిశేఖరుని జటాభరము [6]డిగ్గి, | యభ్రపథమున ధాత్రికి నవతరించి,
నాగలోకంబు దరిసి, పుణ్యతఁ దనర్చి | సగరతనయుల ముక్తిపారగులఁ జేసె.

125


క.

ఆరాజసుతుఁడు దెచ్చిన | కారణమున, సకలలోకకల్మషపటలీ
హారిణి యగు సురనది, భా | గీరథి యనుపేర విదితకీర్తి వహించెన్.

126


క.

[7]తదనంతరమున సుగుణా | స్పదుఁడగు యువనాశ్వనృపతి ప్రభవము నొందెన్
ముదమున నతనికిఁ ద్రిజగ | ద్విదితుఁడు, మాంధాతృ నామధేయుఁడు వొడమెన్.

127


క.

విశదయశః[8]పటగర్భిత | దశదిగ్వలయుం డతండు దారుణబాహా
నిశితాసిపాటవంబున | దశకంఠుని గెలిచె సమదదర్ప మెలర్పన్.

128


శా.

సాధుత్రాణకళావితంద్రుఁడు, హరిశ్చంద్రుండు జన్మించి, తే
జోధుర్యుండు వశిష్ఠు[9]పూన్కి నిలుపన్ శుద్ధాంతరంగంబునన్
గాధేయుం డొనరించు దుష్క్రియల, శోకంబందియున్, సత్యభా
షాధీరుం డగుచున్, ద్విసప్తయుగముల్ శాసించె భూచక్రమున్.

129
  1. వెండి - మ,తా,హ,ర
  2. హయార్థ - మా
  3. వెల్లి - మ, ర, క
  4. దాపబాలాంత - త
  5. శశిధరునిజజటా - త
  6. గాంచి - మ,తి, తీ,హ ,ర, క
  7. ఈ ప.ర ప.లో లుప్తము.
  8. పటు - మ, తా,హ,ర,క
  9. పూన్కె - మ, తా,హ