పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

167


తే.

లనఁగ, విఖ్యాతులై మింతు రధికమహిమ | వరమహీసురరాజన్యవైశ్యశూద్ర
కామినీజనకాముకగణవదాన్య | సరసపుంగవు లమ్మహాపురవరమున.

115


మ.

తరులెల్లన్ సురభూజముల్, శిలలమొత్తంబెల్లఁ జింతామణుల్,
వరగోబృందములెల్లఁ గామదుఘముల్, [1]భామాజనంబెల్ల [2]
చ్చరతండంబు, హయంబులెల్ల దివిజాశ్వంబుల్, మదానేకపో
త్కరమెల్లన్ దివిషద్గజంబు లనఁగాఁ గన్పట్టు నవ్వీటిలోన్.

116


వ.

ఇట్లు వైవస్వతమనువు సకలపదార్థపరిపూర్ణంబును, సకలవైభవాకీర్ణంబును, సకల
సౌభాగ్యసముదీర్ఘంబునుంగా, నయోధ్యానగరంబు నిర్మించి, యందుఁ గృతాభిషేకుండై,
న్యాయమార్గంబున రాజ్యంబు సేయుచుండె. అంతఁ, దద్వంశంబునకు నవతంసంబై
యిక్ష్వాకుం డుదయించె. తదన్వయంబున,

117


చ.

అగణితబాహు[3]శక్తిసముదంచితుఁడై , తన[4]పెంపు దేవతల్
పొగడఁగ, శత్రుభూపతులపొంక మణంచి, శతాశ్వమేధముల్
తగ నొనరించి, భూసురుల దన్పె ధనంబుల, నమ్మహాత్ముఁ డా
సగరుఁడు సంభవించె గుణసాగరుఁడై , మనువంశరత్నమై.

118


క.

ఘనపుణ్యుం డాసగరుఁడు | తనభామినులందు సత్త్వ[5]ధర్మాన్వితులన్
దనయుల నఱువదివేవురఁ | గనియె నఖండప్రతాపగర్వోన్నతులన్.

119


ఉ.

వారలు నూఁగుమీసములు వచ్చుతఱిన్, తమతండ్రి[6]పంపుగా
దారుణశక్తిజాలములు దాల్చి, మఖాశ్వముఁ గావఁబోవ, జం
భారి తదీయఘోటకము నర్థి హరించి, భుజంగలోకముం
జేరి, నిమీలితాక్షు, మునిశేఖరు, భాగవతాగ్రగణ్యునిన్,

120


చ.

కపిలుని గాంచి, యామునిశిఖామణిచెంగట నశ్వరత్నమున్
నిపుణతఁ గట్టిపోయె; నిట నిష్ఠురు లాసగరాధిపాత్మజుల్
కుపితమనస్కులై, సవనఘోటముఁ గానక కంపితాత్ములై
విపులధరిత్రియున్, గగనవీథియు నారసి చూచి వెండియున్,

121
  1. వామా - మా
  2. నప్సరతండంబు - తా
  3. సత్త్వ - మాత
  4. పంపు - త కంటే భిన్న ప్ర.
  5. ధామా - మా
  6. పంపఁగా - మ,మా,త, తీ