పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/261

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

165


సీ.

వినుఁడు, పూర్వమున నీమనుజాధిపతులు మ | త్కోపాగ్నిముఖమునఁ గూలునపుడు
హిమకరబింబమధ్యమమునఁ గొందఱు, | కొందఱు వరుణదిఙ్మందిరమున,
దారుణ[1]కాననాంతరమునఁ గొందఱు | కొందఱు [2]గిరిగుహాకుహరములను,
యోగీంద్[3]3వేషసంయుక్తులై కొందఱు | చని యణంగినవారు సాధ్వసమున,


తే.

నిట్టి రాజన్యవరులలో నెవ్వరేని | యఖిలభూపాలనమునకు నర్హు లగుదు
రట్టిరాజుల మీరు చేపట్టి మంత్ర | శక్తిఁ, బట్టంబు గట్టుఁ [4]డీస్థైర్యమునకు.

104


చ.

అన విని, యమ్మునిప్రవరు లర్కుని వీడ్కొని యింద్రయుక్తులై
చని, వనవాసదీనులగు క్షత్రియులం గొనివచ్చి, రాజ్యపా
లన మొనరింప నిల్పినఁ జలంబున వారలు ధర్మబాహ్యులై
మనుజుల [5]శౌర్యదండవిధి మాటికి [6]నొంపుచు గర్వితాత్ములై,

105


ఆ.

[7]తగఁ గిరాతవేషధారులై వనముల | కరిగి రంత, మునులు వరుణలోక
వాసులైన రాజవర్యులఁ దెచ్చి రా | జ్యమున నిలుప, వారు ననుదినంబు,

106


క.

మదిరాపానవిహారము | వదలక యన్యోన్యకలహవశమునఁ బ్రజలన్
విదళింపుచు వర్తింపఁగఁ | బదపడి భూతలము శూన్య[8]భావము నొందెన్.

107


సీ.

అది గాంచి, పద్మజుం డర్కశీతాంశుల | వలన రాజకులంబు గలుగఁజేసి,
తద్వంశజాతభూధవులకు నింద్రుని | వలన మనోహరైశ్వర్యమహిమ,
ధననాథువలన విత్తము, చండభానుని | వలనఁ బ్రతాపంబు, వనరుహారి
వలనఁ గాంతియు యశోవైభవంబును, సురా | చార్యునివలన రాజన్యనీతి


తే.

బలము, నంభోధివర్యునివలన [9]జయము | జేర్చి, రాజ్యాభిషిక్తులఁ జేసి నిలుప,
నన్నరేంద్రులు ధర్మసహాయు లగుచుఁ | బాడి తప్పక బుద్ధిసంపదలఁ బొదలి,

108


ఆ.

సుజనరక్షణంబు కుజనశిక్షణమును | సూనృతోక్తిరతియు సుభగమతియుఁ
గలిగి, ధాత్రి యేలి రలఘుతేజంబున | విప్రపూజనాభివృద్ధు లగుచు.

109
  1. మౌ, రణాంతరమున - తి, తీ
  2. మహి - త, తా
  3. శేష - తా, తి, తీ,ర
  4. డైశ్వర్యమునకు - తా. కంటె భిన్న ప్ర.
  5. జౌర్య - మ,మా, క
  6. నొప్పుచు - అన్ని ప్ర.
  7. తగిలి గీతవేష - మా,త,కంటె భిన్న ప్ర.
  8. భాగము - మ,హ,ర,క
  9. గలుగఁజేసి - తా