పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

163


క.

నారాయణబాహుసుధా | పారావారమున నిట్లు ప్రభవించిన యా
ధీరాత్ములు నృపచంద్రులు | ధారుణి కేఁతెంచి నీతితత్పరమతులై,

88


ఉ.

కోపము చిన్నమంత, తలకొన్న ప్రసాదము మేరువంతగాఁ
జూపి, ప్రజానుపాలనము సూనృతవృత్తి నొనర్పుచున్, రిపు
క్ష్మాపతులన్ హరించి, గరిమంబున రాజ్యము చేసి చేసి, యు
ద్దీపితదర్పులై, తపనతేజముఁ జూచి సహింప కుద్ధతిన్,

89


మ.

ఘనబాహాబలదుర్మదాంధు లగుచున్, గంజాప్తుతో దివ్యసా
ధనముల్ పూని రణం బొనర్చినను, మార్తాండుండు కోపించి, యా
జననాథావళిఁ బట్టి మ్రింగుటయు, విశ్వక్షోణికిన్ రాజు లే
క, నరుల్ తస్కరబాధల న్నిబిడ దుఃఖవ్యాప్తులై యున్నెడన్.

90


ఆ.

కువలయప్రమోదకుండగు రాజు లే | కున్న [1]1సత్పథంబు వన్నె దిగదె?
కువలయప్రమోదకుండగు రాజు లే | కున్న సత్పథంబు వన్నె దిగదె?

91


చ.

అని తలపోసి, భూమివలయంబునకుం దగు రాజవర్యు నొ
క్కనిఁ గొనితేరఁగా నుచితకార్యవిశేషము నిర్ణయించి, స
న్మునులు ఆ[2]దివాకరుం గదిసి మూర్ధసమర్పిత[3]పాణిపద్ములై
వినుతి యొనర్పఁజొచ్చిరి, పవిత్రవచోగతి నమ్మహాత్మునిన్.

92


సీ.

సప్తాశ్వ! మార్తాండ! జలజవనీమిత్ర! | [4]సర్వలోచన! దేవ! సర్వవంద్య!
సర్వగ్రహాధిప! సర్వరోగాపహ! | సకలజగద్దీప! సామరూప!
భాస్కర! దినకర! బ్రహ్మాండభూషణ! | దశశతకిరణార్క! తపన! సూర్య!
ద్వాదశాత్మక ! వికర్తన! దివాకర! బోధ | మయ! జగన్మయ! సదాధ్యయననిరత!


తే.

యరుణ! కాశ్యప! తిమిరసంహరణచతుర! | యర్యమాదిత్య! దివిజేశ్వరాదిసేవ్య!
సత్యసంకల్ప! [5]మందేహదైత్యమథన! | స్వీకరింపుము మన్నమస్కృతిశతములు.

98


ఆ.

చండతిమిరపీతసకలచరాచరో | ద్ధరణకరణరూపధారి వగుచుఁ
బ్రతిదినంబు [6]నొందఁ బరమజగత్సాక్షి | వరయ నీవ కావె యజ్ఞమిత్ర!

94
  1. తత్పదంబు - తా
  2. దివౌకసుల్ - తీ
  3. పాద - తీ
  4. సర్వావలోకన - తీ
  5. మండిత - మ,మా, తా, తీ, హ, ర,క
  6. పొడమ - మా