పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

159


సీ.

బ్రహ్మకల్పముదాఁక బ్రహ్మఘ్ను లుందురు | తిరముగా సంఘాత[1]నిరయమందు,
మధుపానరతి[2]క్రియామత్తు లుందురు కాల | సూత్రనారకమందు శోకమునను,
స్పర్ణచోరకులగు సాహసు లుందురు | తప్తాఖ్యనరకమధ్యమమునందు,
గురువిప్రదూషణపరతంత్రు లుందురు | క్రిమిభోజనమునందు ఖేదమునను,


తే.

నిందకులు నాస్తికులు నతినీచమతులు | భ్రూణహంతలు కన్యలఁ బొందువారు
బలిమిఁ బరభామినులఁ [3]జెఱపట్టువారు | ఘోరగతిఁ బొందుదురు వజ్రనారకముల.

63


క.

ఋతుకాలంబున లజ్జా | వతియగు సతిఁ బాసి చనిన వల్లభుఁ డతిదుః
ఖితుఁడగుచును వర్తించును | సతతంబును గాలపాశసంఘాతములన్.

64


క.

నిరయమున నున్నవారును, | నిరయోన్ముఖులైనవారు, నిరయశ్రేణిం
దరియించినవారలునై | యురుతరదుఃఖముల నెరియుచుందురు ప్రాణుల్.

65


తే.

నరకదుఃఖానుభవము నెందఱు భజింతు | రందఱును గామమోహితులై జనింతు,
రుర్విసుర! ధాత్రిలో నెంద ఱుదితులైరి | యందఱును వచ్చుచుందు రీయమునిపురికి.

66


సీ.

చూడుము! మేదినీసురవర్య! రోషాగ్ని | సందీప్తలోచనోజ్జ్వలితుఁ డగుచు,
దక్షిణకరమున దండంబు చూపట్ట | నట్టహాసభయంకరాస్యుఁ డగుచు
యాతనాసంగతు లగుజీవులకు నెల్ల | నతిభీమదర్శనుం డగుచు మెఱసి,
చండశూలాయుధోద్దండబాహోగ్రుఁడై | వరుస నల్గడలఁ గింకరులు గొలువఁ,


తే.

జిత్రగుప్తుండుఁ జిత్రుండుఁ జిత్రముఖుఁడుఁ | జిత్రకేతుండు సమముగా జీవకోట్ల
కెల్లఁ బాపంబు పుణ్యంబు నేరుపఱుప, | నిండుకొలువున్నవాఁ డంతకుండు వాఁడె.

67


వ.

ఇట్టి యమలోకంబునకు నాగ్నేయభాగంబున నన్నపర్వతంబులును, నాజ్యప్రవా
హంబులును, బాయసకూపంబులును, శర్కరాసరోవరంబులును, మాక్షికతటాకంబులును
మొదలుగాఁ గలుగు పదార్థంబులకు నిలయంబై, చతుర్ద్వారసమేతంబై పితృలోకంబు వర్తించు.
అందుఁ బితృదేవతలు వివాహాదికర్మకాలంబుల సమాహూతులై, ప్రాగ్ద్వారస్థితసత్యవసు
సంజ్ఞికవిశ్వేదేవతాసమేతులును, దీర్థశ్రాద్ధాదులయందు సమాహూతులై యుదగ్ద్వారస్థిత
ధూర్లోచనసంజ్ఞికవిశ్వేదేవతాసమేతులును, మాససాంవత్సరికాదిపైతృకంబులం బశ్చిమ
ద్వారస్థితపురూరవాద్రవసంజ్ఞికవిశ్వేదేవతాసమేతులును, సపిండీకరణాదులయందు
దక్షిణద్వారస్థితకామలకామసంజ్ఞికవిశ్వేదేవతాసమేతులునై, తద్విశ్వేదేవపూర్వకంబుగ

  1. నరక - త
  2. గల - తీ
  3. జేరఁబట్టు - తీ