పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

156

వరాహపురాణము


తే.

కలితమానస యగుచు నకారణంబ | విషమువెట్టిన దేహంబు విడిచిపోవ,
శమనుఁ డాత్మీయకింకరస్వామిఁ జేసి | భక్తిఁ బనిగొంచు, నను నేఁడు పనిచె నిటకు.

46


క.

ఇచ్చటి ధరణీపాలుం | [1]డచ్చలమున వేఁటవెడలి [2]యధికపిపాసం
జచ్చు నిఁక, నతనిఁ గొనిపో | వచ్చి, నినుం జూడఁగంటి వర్ణితపుణ్యా!

47


వ.

అని చెప్పి, భూసురాన్నభోజనపుణ్యాతిరేకంబున దివ్యదేహంబు గలుగుటయుఁ ,
దనుఁ గూడవచ్చినవారలు యమకింకరు లనియు నెఱింగించిన, శివశర్మ ప్రముదితుం డగుచు,
శీలుని కర్ణంబు డాసి, మంతనంబున నిట్లనియె.

48


క.

ఈకాయముతోడనె సుర | లోకంబును, బ్రేతరాజులోకముఁ జూడన్
[3]నాకుం గాంక్ష యుఁ బొడమె, న | శోకగతి న్వాని రెంటిఁ జూపుము [4]పుత్రా!

49


చ.

అనవుడు, 'భూసురేంద్ర! నిను నంగముతోఁ గొనిపోవరాదు, నీ
తను వొకచోట దాఁప నుచితంబగు యత్నము సేయు, మంత నా
జనపతిఁ గాలకింకరవశంబున మీఁదికి నంపి వత్తు నే'
నని యెఱిఁగించి, శీలుఁడు రయంబునఁ బోయెఁ దిరోహి[5]తాత్ముడై.

50


శా.

ఆలోఁ దత్పురనాయకుండు మృగయావ్యాసక్తి నానాచమూ
జాలంబు ల్గొలువంగఁ గానలకు నిచ్ఛావృత్తిమై నేఁగి, శా
ర్దూలాదిమృగంబులన్ శితశరస్తోమంబునం దున్ని, యు
ద్వేలగ్రీష్మము దాఁకి నొచ్చి, మృతిఁ బొందెన్ దైవయోగంబునన్.

51


ఉ.

భూపతి యిట్ల కాలగతిఁ బొందిన, శీలుఁడు దివ్యయానసం
స్థాపితుఁ జేసి, కింకరవశంబున మీఁదికి నంపి, సత్యవా
చాపరతంత్రబుద్ధి శివశర్మగృహంబున కేఁగుదెంచి, త
ద్దీపితగాత్ర మొక్కబిలదేశమునందు సురక్షితంబుగన్.

52


క.

పదిలంబు చేసి, యాభూ | త్రిదశేంద్రుని నొక్కదివ్యదేహములోనన్
ముదమున నిడుకొని చని యం | బుదమార్గము గడచి, వినయమున నిట్లనియెన్.

53
  1. డిచ్చకమున - తి,తీ
  2. ఎసఁగ - తి తీ
  3. నాకు న్నాకాంక్ష వొడమె శోక - మ,మా, త; నాకుంగాంక్ష జనించె నశోక - తి, తీ,క
  4. నీంద్రా - తా
  5. తాస్యుడై - క