పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

వరాహపురాణము


ఉ.

శీలుఁడు దానిరాకఁ గని, చిత్తమునం బరితాప మొంది, యా
బాలిక మన్మథార్త యగుభావముఁ గల్గొని, పల్కెఁ దల్లి! నీ
వేలరు దెంచితిట్లు? మన [1]యిద్దఱికిన్ శివశర్మ తండ్రి, దు
శ్శీలము మాను, నా యనుఁగుఁ[2]జెల్లెల, వీ విధి నీకు ధర్మమే?

34


చ.

ఉడుగుము పాపబుద్ధి, యిది యెప్పదు, మానఁగఁజాలవేని యి
ప్పుడె చని, యన్యపూరుషుని బొంది భయంకరరౌరవాగ్నిలోఁ
దొడిఁబడఁ గూలి, నీ దురిత[3]దుష్టఫలంబు [4]భుజింతు గాని, యిం
పెడలఁగ నన్నునుం జెఱుపనేటికిఁ జూచెదు విప్రకన్యకా!

35


చ.

నిమిషసుఖర్థమై కులము నీఱుగఁ [5]జేసి, దురాత్ము లబ్బినం
దమకముతో రమించి, నిజనాథుని రౌరవమందుఁ ద్రోచి, [6]యు
త్తములగు నత్త మామ [7]దలిదండ్రులకుం దలవంపు చేసి, మా
న మెడలి, మన్మథజ్వరమునం జెడిపోదురు దుష్ట కామినుల్.

36


చ.

సుజనునకైన, దుర్గృహము చూచిన దారుణలగ్నమందు, నా
త్మజు లుదయించిరేనిఁ బితృధర్మము వారికిఁ గల్గదన్న స
ద్విజవచనంబు తప్ప' దని వేమఱు కర్ణయుగంబు పాణి పం
కజముల మూసికొంచు, నెసకంబున వెండియు దాని కిట్లనున్.

37


తే.

'తల్లీ! నీ వింక నిచ్చటం దడవు నిల్వం | జనదు పోపొమ్ము' నావుడు, మనసులోన
నతివ లజ్జించి, [8]కోపాకులాత్మ యగుచు | మొక్కలంబునఁ బితృగేహమునకు నరిగి.

38


చ.

కనుగవ కింపొనర్చు నుపకాంతుని, దుష్కులజాతునైనఁ బై
కొని, రతిబంధభేదములఁ [9]గూడి రమింపుచునుండి, బంధకీ
జనమణి యొక్కనాఁడు విషసమ్మిళితాన్నము పెట్టి చంపి స
జ్జననుతశీలునిన్, గుణవిశాలుని, శీలుని, బుణ్యలోలునిన్.

39
  1. యిర్వురకున్ - తి తీ
  2. జెల్లెల యీ - తి, తీ
  3. దుఃఖ - మా
  4. భజింతుగాక - మా, తా,హ
  5. నెట్టి - మా, ర; నిట్టు - త, క ; బెట్టె - తా; జేయు - తి, తీ
  6. సత్తము - తి తీ
  7. తలి - అన్ని ప్ర.
  8. రోషాకులాత్మ - తి, తీ, క
  9. గోరి - తా