పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

151


చ.

విను, మునినాథ! పూర్వమున వీప్రుఁ డోకండు కృతాంతువీటికిం
జని, హరినామ మొక్కపరి సంస్తుతి చేసిన, నాలకించి, త
ద్ఘన[1]సుకృతంబుఁ జేసి, నరకస్థితు లాక్షణ[2]మందు ముక్తులై
రనుడు, మృకండునందన మహాముని రోమశుతోడ నిట్లనున్.

13


క.

ధరణీసురుఁ డెట్లరిగెను | నరకస్థలి? కతఁడు విష్ణునామము నుడువన్,
నరకస్థితు లది విని, హరి | పురమున కేరీతిఁ జనిరి? భూసురతిలకా!

14


వ.

అనిన మార్కండేయునకు రోమశుం డిట్లనియె.

15

శివశర్మోపాఖ్యానము

క.

మునివల్లభ! పుష్పావతి | యన నోక్కపురంబు ధాత్రి కవతంసంబై
తనరారుచుండుఁ, దత్పురి | యనుపమవిభవంబు పొగడ నజునకు వశమే?

16


సీ.

పార్వతీశ్వరుభాతి భాసిల్లు నప్పురి | హేమ[3]వప్రములు మిన్నేఱు మోచి,
హరిరీతిఁ బొల్చు నప్పురి[4]పరిఖాశ్రేణి | తనలోన భువనసంతతులఁ బూని,
యంబుజాసనుమాడ్కి నలరు నప్పురిగోపు | రములు హిరణ్యగర్భత వహించి,
యబ్ధి కైవడి నొప్పు నప్పురి రాజమా | ర్గము వాహినీ సహస్రముల [5]బెరసి,


తే.

సిరుల [6]పుట్నిల్లు, సౌభాగ్యగరిమ [7]వెంట, | మంగళంబుల టెంకి, ధర్మముల నెలవు ,
వినుత సర్వార్థనిలయంబు ననఁ, ద్రిలోక | భాసురంబగు నమ్మహాపట్టణమున.

17


మ.

చతురామ్నాయవిశారదుం, డఖిలశాస్త్రగ్రంథనిర్ణేత, [8]
త్క్రతునిర్దూతసమస్తకల్మషుఁడు, రాగద్వేషదూరుండు, సు
వ్రతుఁ డొప్పున్, శివశర్మనా, ధరణిదేవశ్రేష్ఠుఁ, డాసద్గుణా
న్నతచర్యుం డొకనాఁడు ప్రొద్దున నుషస్స్నా[9]నార్థియై యేటికిన్.

18


తే.

చని, కృతస్నానుఁడై కాల్యసమయకర్మ | పటల మొనరించి, భాస్కరోపాస్తి [10]చేసి,
కుశసమిత్ఫలమూలముల్ గొనుచు మగిడి | పురికిఁ జొత్తెంచునప్పు డాతిరువుపొంత.

19
  1. సుకృతంబుచేత - మా,త
  2. మాత్ర - త
  3. పత్రములు . మ,త, తా, తి, తీ, ర,క
  4. పరిఘ - తీ కంటె భిన్న ప్ర.
  5. మెఱసి - తి, తీ
  6. పుట్టిల్లు - మ, తి తీ
  7. పింట - ర; పెంపు - తి,తీ
  8. సంగత - త కంటే భిన్న ప్ర.
  9. నార్థమై - మ,మా, తి, తీ: నార్తుఁడై - హ
  10. తీర్చి - మ,మా,త, తా, హ,ర,క