పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

150

వరాహపురాణము


సీ.

చాంద్రమానమున మాసము నిండ, నది యొక్క | దివసమై చనుఁ బితృదేవతలకు,
దినములు పితృమాసమున నెన్న మున్నూట | యఱువది యొక యబ్ద మమర[1]తతికి,
దేవమానంబున దివ్యవర్షంబులు | పండ్రెండువేలైనఁ బరగ యుగము,
పరువడి [2]నేకసప్తతిమహాయుగములు | చింతింప నొక్కమన్వంతరంబు,


తే.

రమణఁ బదునాల్గుమన్వంతరములు చనిన | నబ్జభవునకు నొకదిన, మందులోన
నవతరించును భూభార మణఁప శౌరి | మీనకూర్మాదిరూపసమేతుఁ డగుచు.

7

హరినామమహత్త్వము

ఉ.

జిహ్మగసార్వభౌముఁడు, శచీరమణుండును, బంకజాసన
బ్రహ్మతనూజులుం, గమలబాంధవులున్, హరి నాద్యు నీశ్వరున్
బ్రహ్మకు జన్మహేతువుగఁ బ్రస్తుతి సేతురు గాని, కేవల
బ్రహ్మము విశ్వకర్త యని భావమునం దలపోయ రజ్ఞతన్.

8


క.

హరినామస్మరణంబునఁ | బరిహృతమౌ వానిదురితభారంబుఁ, బ్రభా
కరతేజస్స్ఫురణంబునఁ | గర మరుదుగఁ జెడని యంధకారముఁ గలదే?

9


క.

సురలోకసతతసన్నుత | [3]చరితుండును, దైత్యతిమిర[4]చండాంశుఁడు స
త్పురుషహృదయాలయుఁడు నగు | హరికన్నఁ దదీయనామ మధికం బనఘా!

10


మ.

ఉపవాసంబులఁ, దీర్ఘసేవనములన్, యోగావధానంబులన్,
జపహోమవ్రతచర్యలం, దపములన్, సన్యాసకృత్యంబులన్,
విపులక్లేశము నొందు సజ్జనులకున్, విష్ణుండు [5]నీలేని మో
క్షపదం బిచ్చుఁ దదీయనామము, సకృత్సంకీ ర్తిమాత్రంబునన్.

11


క.

శ్రీహరినామోచ్చారణ | మాహాత్మ్యముఁ గలుగఁబట్టి, మానవు లఘసం
దోహములఁ బాసి పొందుదు | రైహికసుఖపారలౌకికానందములన్.

12
  1. పతికి - మ, తి, తీ,హ,ర,క
  2. నొక్క - తా
  3. చరణుండును - తి, తీ
  4. చండాంశుండున్ బురుష - తీ; చండాంశుఁడు తత్పురుష - మ,మా,త, తా, తి,హ,ర
  5. నున్లేని - అన్ని ప్ర.