పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

వరాహపురాణము


క.

సనకాదియోగిపుంగవు | లును గానఁగలేని నిన్ను, లోకేశ్వరు, నేఁ
గనుఁగొంటి మత్పురాతన | జననార్జితపుణ్యచయము సఫలం బయ్యెన్.

190


క.

కోపించి చంపెఁ గంసుఁడు | చాపలమున మత్కుమారషట్కము, నిఁక నీ
రూప ముపసంహరింపుము | తాపత్రయహరణ! దేవతా[1]నుతచరణా!

191


వ.

అని వినుతించి, సాంత్వనాలాపంబుల విన్నవించిన వసుదేవునకు, నా దేవదేవుం
డిట్లనియె.

192


చ.

భయ మిఁక నేల? కంసముఖపార్థివభంజన మాచరింప నే
నయగతి మీకు నందనుఁడ నైతి, వ్రజంబున నందభామినీ
శయనమునందు న న్నునిచి, చయ్యనఁ దత్సుతఁ దెచ్చి, దేవకీ
శయనము నందుఁ బెట్టుము ససంభ్రమతం జను మీక్షణంబునన్.[2]

193


ఉ.

అని హితకార్యముం దెలిపి, యాశ్రితలోలుఁడు బాలుఁడైనఁ, గ
న్గొని, వసుదేవుఁ డెత్తుకొని, గొంకక రాత్రిఁ గళిందజానదిం
దనరఁగ దాఁటి, [3]నందవనితాశయనంబునఁ బుత్త్రు డించి, త
త్తనుభవఁ దెచ్చి, యాత్మసతితల్పముఁ జేర్చిన తత్క్షణంబునన్.

194


క.

ఆ పిన్నది [4]నినదంబుగ | వాపోయిన, నిద్రదేఱి వాకిటికాడన్
గాపున్నవాఁడు చెప్పినఁ, | గాపురుషాగ్రేసరుండు [5]కంసుం డలుకన్.

195


చ.

పవనజవంబునం బఱచి, [6]పాణిఁ గృపాణముతోడ సోదరీ
భవనము చొచ్చి, [7]కోలుపులి బాలమృగిం గబళించునట్లు, పా
టవమున మేనకోడలి దృఢంబుగఁ బట్టి, శిలాతలంబుపై
[8]న్రవమున నెత్తివైచుటయు, [9]నాశిశు వప్పుడు శక్తిమూర్తియై.

196


తే.

గగనవీథికి లంఘించి, కంసుఁ జూచి, | 'యోరి పాపాత్మ! నీపాలి వైరి వాఁడె
బాలుఁడై యున్నవాఁడు [10]వ్రేపల్లెలోన | నిక్క' మని చెప్పి, తాఁ బోయె నిలువ కచట.

197
  1. నత - త, తా, తి, ర
  2. ఈ ప.త. ప్ర. లో లుప్తము.
  3. నందు వనితా - మ,మా,త
  4. నినదంబున - తా
  5. కడుక్రోధమునన్ - క
  6. బాణకృపాణ - మ,మా, త, తా, తి,హ, ర,క
  7. కోలు - తీ; కోర - త; కోరు -మ, మా,హ, ర,క
  8. రవమున (యతి?) - మ, త, తా, తి, తీ,హ,ర, క; స్రవమున (యతి?) - మా
  9. జయ్యన బాలయు (యతి?) - తీ
  10. రేపల్లె - అన్ని ప్ర