పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

వరాహపురాణము


క.

అది గావున, హరిచరితము | తుద మొద లిది యనుచుఁ దెలియఁ, దోయజభవుఁడున్,
బదినూఱుతలలు దాల్చిన | సదయుండును నోపఁ, డితరజనముల తరమే?

148


వ.

అని పలికిన రోమశునకు మార్కండేయుం డిట్లనియె.

149

మార్మికప్రశ్నము - ధార్మికసమాధానము

ఉ.

రోమశ! నీదుపల్కుల విరోధము గానఁగవచ్చె, నిందిరా
స్వామికరంబులం దెగినవారలు ముక్తి భజింతురంటి ము
న్నీమహి నా జయాదు లుదయించిరి ముమ్మరు ధాత్రి విష్ణుతే
జోమృతు లయ్యు, [1]నట్టి దిది సూక్ష్మము, నా కెఱిఁగింపు మేర్పడన్.

150


వ.

అనిన రోమశుం డిట్లనియె.
సీ. జయవిజయు లమరశాపంబు దగిలినఁ | బన్నగశాయికి విన్నవింప,
“నేడుజన్మంబు లహీనవైష్ణవభక్తి | సహితులై విప్రవంశమునఁ బుట్టుఁ
డటమీఁద మీకు శాపావసానం బగు” | నని పుండరీకాక్షుఁ డానతీయ,
నన్ని జన్మములు నీసన్నిధానము లేక | కాలంబు గడపుట - గలదె మాకు?

151


తే.

అరులమై మూఁడుజన్మము లంది, పిదప | మిమ్ముఁ జేరెద మని తారె సమ్మతించి
నలిననాభునితోఁ బల్కినారు గాన | ననఘ! జన్మత్రయము వారి కందవలసె.

152


వ.

అని యిట్లు దశావతారవృత్తాంతం బెఱింగించిన రోమశునకు మార్కండేయుం
డిట్లనియె.

153


క.

దేవకివరగర్భంబున | శ్రీవల్లభుఁ డుదయమంది, శ్రీకృష్ణుండై
యేవిధమున శిశుపాలమ | హీవరు [2]తల దునిమె నాన తిమ్ము మునీంద్రా!

154

కృష్ణావతారవర్ణనము

ఉ.

నావుడు, రోమశుండు మునినాథున కిట్లను, బ్రహ్మచేఁ బ్రియం
భావుకలీల, మున్ను శిశుపాలముఖు ల్వరమంది, మత్తులై
దేవతలన్ హరించి, దశదిక్కుల నొక్కట నాక్రమించి, బా
హావిపులప్రతాపమున నడ్డము లేక చరింప నయ్యెడన్.

155
  1. నంటివిది - తా,హ; బుట్టినది - తీ
  2. లను - మ,తి, తీ,హ,ర,క