పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

వరాహపురాణము


సీ.

దండకారణ్యంబు దరిసి, యచ్చోటు వాసి | చని, కుంభజాశ్రమమున వసించి,
తదనంతరము భరద్వాజాశ్రమమున శూ | ర్పణఖ నాసికఁ దున్మి పాఱవైచి,
ఖరదూషణాది రాక్షసుల ఖండించిన | దద్వార్త విని యల్గి, దశముఖుండు
మారీచు ననిపిన, నారాక్షసుఁడు చిత్ర | మృగమూర్తి దాల్చి సమీపసీమ


తే.

జనకజాదృష్టిపథమున సంచరించి, | తన్నుఁ బట్టంగ వచ్చిన దశరథేంద్ర
తనయు నెలయించుకొని, కొంతదవ్వు చనిన | రావణాసురుఁ డంత సంభ్రమముతోడ.

134


తే.

పర్ణశాలానివాసినిఁ, బరమసాధ్వి, | జనకసుతఁ దేరిపైఁ బెట్టుకొని రయమున
నాత్మపురి కేఁగె, నంత మాయామృగంబుఁ | జంపి రాముఁడు మగుడి యాశ్రమము చేరి.

135


క.

ధరణితనూభవఁ గానక | పరితాపము నొంది, [1]శోకపరవశుఁడై సో
దరసహితంబుగఁ బంపా | సరసీతీరమున కరిగి, జనపతి యచటన్.

136


ఉ.

పావనిఁ గాంచి, తన్మధురభాషల కుత్సవమంది, చేరి, సు
గ్రీవునితోడ సఖ్య మొనరించి, [2]1నిజస్థితి భానుసూనుచే
తో[3]విహితంబు సేయుటకు దుందుభికాయముఁ బాఱమీటి యు
ద్ధావనిఁ గూల్చె వాలి నొకయమ్మున ఖేచరులెల్ల మెచ్చఁగన్.

137


ఉ.

వానరరాజ్యపీఠమున వారిజమిత్రకుమారు నిల్పి, సీ
తానలినాక్షి పోయిన[4]పథం బరయన్ హనుమంతు నంప, నా
ధీనిధి గోష్పదంబు పగిదిం జలరాశి నతిక్రమించి, లం
కానగరంబు [5]సొచ్చి, జనకప్రియనందనఁ గాంచి నమ్రుఁడై.

138


క.

విభుఁ డిచ్చిన మణిముద్రిక | నిభగామిని కీయ, నమ్మహీసుత రామ
ప్రభుని గనుఁగొనినకైవడి | శుభహర్షము నొందెఁ, బవనసూనుఁడు మఱియున్.

139


ఉ.

రామునిసేమముం దెలిపి, రమ్యమృదూక్తుల నూఱడించి, యా
రామ యొసంగినట్టి ఘనరత్నముఁ గైకొని, యుత్సహించి, లం
కామణి[6]సౌధజాలములు కాలిచి, యక్షకుమారుతోడ ను
ద్దామబలాఢ్యులైన బహుదానవులం బరిమార్చి ధీరతన్.

140
  1. యడవిఁ బరికింపుచు - త
  2. జలస్థితి - మా,త
  3. విమలంబు - తీ; విదులంబు - తా; విముదంబు - మ,మా,తి,హ,ర,క
  4. విధం - క
  5. లోన - తి,తీ
  6. హర్మ్యసౌధములు - ర