పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

129


క.

దళిత హిరణ్యాక్షతనూ | గళితాసృఙ్మాంసశోణఘనఘోణాగ్రో
జ్జ్వలుఁడై ధర యె త్తిన హరిఁ I బలుమఱు వినుతించి రమరపతి మునిముఖ్యుల్.

97


క.

వినుము, క్రమంబున విజయుం | డనునతఁడు హిరణ్యకశిపుఁ డను దానవుఁడై
జనియించిన, నరకేసరి | తనువున హరి వాని నఖవిదారితుఁ జేసెన్.

98


వ.

అని చెప్పిన, మార్కండేయుండు విస్మితుండై, యంభోధరగంభీరస్వరంబున
రోమశున కిట్లనియె.

99

వరాహావతారవర్ణనము

సీ.

అనఘ! విశ్వేశ్వరుం డగు శంకరునకు నా | వాసమై యుండుఁ గైలాసశిఖరి,
యారాజతాచలం బసమానశృంగంబు | గాఁ బ్రసిద్ధికి నెక్కెఁ గాంచనాద్రి,
సకలాశ్రయము రత్నసానుశోభితమునై | యామేరుగిరి యుండు భూమినడుమ,
నది నవఖండమై పదికోట్లయోజనం | బుల వెడల్పున నొప్పు భూరిమహిమ,


తే.

నట్టి భూమండలమునెల్లఁ జుట్టి పట్టి | దనుజుఁ డేరీతి [1]జలధిలో మునుఁగవైచె?
నింత బాహాబలము వాని కెట్లు గలిగె? | నీ రహస్యార్థ మెఱిఁగింపు మిద్ధచరిత!

100


వ.

అనిన, రోమశుం డిట్లనియె.

101


చ.

వినుము మునీంద్ర! యాదనుజవీరుని దీర్ఘభుజాయుగంబు కాం
చనగిరిసార, మాతఁడు నిజంబగు నల్క సురాద్రి వార్ధిలో
మునుఁగఁగవైచి, దేవతలమూల [2]మడంచెద నంచు, నాత్మనా
శనసమయంబు గానక, ససంభ్రముఁడై కనకాచలేంద్రమున్.

102


ఆ.

పెనఁచి పట్టి, యూఁచి, పెకలింప [3]నుంకించు | నంత, రజతశైలమందు నున్న
భూతనాథుఁ [4]డలిగి బొటమనవ్రేల నా | త్రిదశశిఖరిఁ [5]గ్రుంగ నదుముటయును.

103


క.

హరచరణాంగుష్ఠంబునఁ | బరిపీడితమగుచు, దివిజపర్వత మేనూ
టిరువదియోజనములు స | త్వరమున దిగఁబడియె ధరణివలయముతోడన్.

104


వ.

ఇట్లు ధరావలయంబుతో సురనిలయంబగు సువర్ణభూధరంబు రసాతలంబున
గ్రుంగిన.

105
  1. (వ?) నధి-మా ,తి,హ, గంగలో- తీ
  2. మణంచెద -త
  3. నూకించు - హ
  4. డొరగి - మ , తి, తీ,హ,ర,క
  5. శృంగ మదుము - మ,తా,తి