పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

వరాహపురాణము

భూసురప్రతతికృతాపరాధము

సీ.

తొల్లి భూమిసురుల్ తోయజాసను మీఱ | వేదాది[1]విద్యాప్రవీణు లగుచు
జగతిపై వర్తించు [2]నిగమతత్త్వార్థమ్ము | విడిచి యపార్థముల్ నొడివికొనుచు
గర్వాంధులైనఁ, దద్గర్వంబు వారింప | హరి, సోమకుండను నసుర నొకని
నిర్మించుటయు, వాఁడు నిగమంబులను విప్ర | మూలధనం బెల్ల మ్రుచ్చిలించి


తే.

యంబునిధిలోన దాఁగిన, [3]నవనిసురులు | వేదనిహీనులై, గర్వవాద ముడిగి
సంధ్య లుడివోయి, బ్రహ్మవర్చసము దొలఁగి | విహితయాగాదిసత్క్రియారహితు లగుచు.

78


క.

ఆపద్భవమగు పశ్చా | [4]త్తాపంబునఁ బొంది, పూర్వధర్మవిశేషో
ద్దీపితసుజ్ఞానంబున | శ్రీపతి మది నిల్పి తపము చేసిరి విప్రుల్.

79


ఉ.

నిర్గతగమ్యులైన యవనీసురు లుగ్రతపంబు సేయ, నం
తర్గతరోషుఁడై జలజనాభుఁడు దా శరణాగ[5]తావనా
నర్గళసత్కృపాపరత నత్తఱి ముందఱ నిల్చి, భూమరు
ద్వర్గముతోడ నిట్లను, నుదారగభీరవచోవిచర్చికన్.

80


చ.

వినుఁడు! మదీయరూపమగు వేదము నిందయొనర్చు మత్తులం
దునుముదు, విప్రులౌట మిముఁ దున్మగరాక, శ్రుతిప్రపంచముం
బనుపడ దాఁచినాఁడ, నిగమంబులఁ జేయుట విప్రకోటికిం
గనుఁగొన జీవుకన్న నధికంబుగదా! వివరింపనేర్చినన్.

81


క.

పశ్చాత్తాపంబునఁ గృత | నిశ్చయులై తపము సేఁత నిందా[6]సత్ప్రా
యశ్చిత్తమయ్యె, మీ రిఁక | నిశ్చిత్తులు గండు, మగుడ నిగమము లిత్తున్.

82


వ.

అని యుపలాలించి, యమ్మహీసురుల వీడ్కొని వారిజోదరుండు పారావారంబు
నకుం జని.

83
  1. దివ్య - మా,త
  2. సర్వతత్వార్థమ్ము - మా,త
  3. నవనిసురలు - అన్ని ప్ర.
  4. త్తాపమునం బొంది - త; తాపంబును బొంది - తీ
  5. తార్చనా - మ, మా, తా, తి, తీ, హ, ర, క
  6. భిప్రాయ - మ,మా, తి,ర, క; దిప్రాయ - ఆ; సప్రాయ - తా; భిప్రాయశ్చిత్తులయ్యు - తీ,హ