పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

125


ఉ.

ప్రేయసిఁ జేరఁదీసి, రతిభేదములం గరఁగింప, నాసరో
జాయత[1]నేత్ర గర్భపుటమం దుదయించిరి విష్ణుభక్తిపా
రాయణులుం, బ్రశాంతులు, నిరంతరధర్మవిశుద్ధ[2]బుద్ధు, లా
మ్నాయపదానువర్తులు ననం దగు దేవవరుల్ క్రమంబునన్.

72


క.

వారలఁ ద్రిజగద్విభుఁ డం | భోరుహలోచనుఁడు నాకభువనమునం దిం
పారఁ బ్రతిష్ఠించె, దయా | పూరితహృదయారవిందభూషితుఁ డగుచున్.

73


దైత్యుల జన్మక్రమము

చ.

పదపడి కశ్యపాహ్వయుఁడు బంధురమోహభరాంధచిత్తుఁడై
మదనరసాతిరేకమున మానవతిన్, దితిఁ బుష్పిణిన్, సుఖ
ప్రదరతిఁ గూడ, దానియుదరంబునఁ బుట్టిరి యాతతాయు, లు
న్మదులు, హరిద్విషుల్, నిగమ[3]నాశకకృత్యులు, దేవశాత్రవుల్.

74


క.

హరి, నిజసేవాపరులగు | సురలకు విద్వేషు లగుచుఁ జూపోపని యా
దురితాత్ముల, దితిపుత్రులఁ, | బరిమార్చుచునుండుఁ ద్రిదశపాలనమునకై.

75


క.

[4]హరికిన్ దేహము సుర, లా ! సురలకు నెగ్గాచరింపఁ జూచినయేనిన్,
హరుఁడైనను విమతుం డా | హరికిం, దత్త్వార్థ మిది మహామునితిలకా!

76


ఉ.

పంకజనాభుఁ డాత్మపదభక్తుల కాపద వచ్చెనేని యా
యంకిలి దీర్చి కాచు, సకలార్థములన్ ఫలియింపఁజేయు, నే
వంక జయంబ యిచ్చు, మునివల్లభ! సజ్జనరక్షకై నిరా
తంకమతి న్వహింపఁడె యతండు ఝషప్రముఖావతారముల్?

77
  1. నేత్రి - అన్ని తాళపత్ర ప్ర.
  2. బంధు - మ, తి, తీ,హ,ర,క
  3. నాశరతుల్ పరతుల్ సురాహితుల్ - తా; సాదరకృత్యులు దేవశాత్రవుల్ (యతి?) - మ; మానులు పాపరతుల్ సురాహితుల్ - మా, త; మానులు వారపతుల్ సురాహితుల్ - తి తీ,హ, ర; దూరులు దారపతుల్ సురాహితుల్ - క
  4. హరిదేహంబులు సురలా - మ,మా,త, తా, తి, హ,ర ,క