పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

వరాహపురాణము


మ.

విను, మాయాసతి! సర్వజంతువులకుం [1]బేర్వేఱఁ దుల్యాంగనా
జనముం గొబ్బున యుష్మదంశమున సంజాతంబుగాఁ జేయు, చే
సినఁ, [2]గాంతాపురుషవ్రజంబు మిథునశ్రీ బొంది, యన్యోన్యమో
[3]నిబద్ధంబునఁ బాయలేక [4]సురతవ్యాసక్తిఁ గ్రీడింపఁగన్.

66


క.

వారలవలనఁ గుమారకు | మారీవ్రాతంబు వొడము, మఱియును దత్త
త్పారంపర్యవశంబునఁ | దోరములై నిగుడు సంతతులు లోకమునన్.

67


క.

[5]రేతోమయసృష్టిక్రమ | మీతెఱఁగున వృద్ఁ బొందు నింతి! భవన్మా
యాతిశయంబునఁ [6]జేతన | జాతంబు పరిభ్రమించు సంసారమునన్.

68


అవతారప్రసక్తి

సీ.

ఈ జగత్త్రయమున నెచ్చోటనైనను | మించి దుర్జనులు జన్మించిరేని,
వేదోక్తమార్గంబు విపరీతమగునేని, I మునుల యాగంబులు మునిగెనేని,
భూనాయకులు ధర్మహీనులైరేని, స | ద్విజులు విద్యలను గర్వించిరేని,
ధరణిఁ బాతివ్రత్యధర్మంబు చెడెనేని, | విషమదైత్యులు సంభవించిరేని,


తే.

కఠినపాషండజనములు గలిగిరేని, | దురితబలమున సత్యంబు విరిసెనేని,
యప్పు డచ్చోటఁ దగురీతి నవతరించి | దుష్టనిగ్రహ మొనరింతుఁ దోయజాక్షి!

68


వ.

అని యానతిచ్చినఁ బుండరీకాక్షు నాజ్ఞానుసారంబున, నమ్మాయాదేవి స్త్రీ[7]వ్యక్తి
నిర్మాణం బొనరించి, విశ్వసృష్టిచక్రంబు నాక్రమించి ప్రవర్తించె నని రోమశుండు
మార్కండేయునకుం జెప్పి, వెండియు నిట్లనియె.

70


అమరుల ప్రాదుర్భావము

ఆ.

కలితకీర్తిశాలి కశ్యపుఁ డొకనాఁడు, | మానవతిని జెఱఁగు మాసి యనల
నామతీర్థవారి [8]నాల్నాళ్ళు చేసిన | [9]యదితిఁ గాంచి, ప్రముదితాత్ముఁ డగుచు.

71
  1. వేర్వేఱ -త, తా,క
  2. దత్కాపురుష - తి,హ,ర
  3. నిబంధంబున - త, తీ,ర
  4. సురస - హ,ర
  5. ఈ ప క ప్ర.లో లుప్తము
  6. యాతను - తా
  7. వేష - క
  8. నాల్నాడ్లు - మ; నానాడ్లు - మా; నానాళ్లు - త, తా, ర; నాల్నాడు - క
  9. యతివ - మ, తి, తీ,హ,ర, క