పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

123


క.

అని [1]విన్నవింపఁ ద్రిజగ | జ్జనకుఁడు లక్ష్మీవిభుండు సర్వముఁ జిత్తం
బున నూహసేసి, విశ్వము | నొనరఁగ నిర్మింప నపుడ యుద్యుక్తుండై.

58


విశ్వసృష్టి వికాసము

చ.

తనరఁగ నాత్మ నాకసముఁ, దద్గగనంబున మారుతంబు, నా
యనిలమునన్ హుతాశనము, నా యనలంబున వారి, యా జలం
బునను ధరిత్రి, నా ధరణిఁ బొందుగ నోషధు, లా మహౌషధీ
వనమున నన్నమున్ భువనవత్సలుఁడై సృజియించె నేర్పునన్.

59


క.

అది [2]సకలజంతుకోటికి | నుదరానలశాంతికరము హుతవహకీలా
వదనమున వేల్వఁగాఁబడి | త్రిదశప్రీతిదము గాఁగ ధృతి నొనరించెన్.

60


తే.

శౌరి మఱి[3]యు విరాడ్రూపధారి యగుచు | సర్వగతుఁడై యనంతరసర్గమునకుఁ
గారణంబగు ధాతృవర్గము సృజంచి | కరుణ తళుకొత్త వారలఁ గలయఁజూచి.

61


వ.

అందు, శిల్పవిద్యాకుశలుండగు విశ్వకర్మం బిలిచి, నీవు లోకత్రయంబునందు సౌధ
కేళీవనపురగ్రామాది విశేషంబులతోడంగూడ దేశంబులు నిర్మింపుమని నియమించి
యనంతరంబ.

62


ఉ.

అంబుజనాభుఁ డాత్మవదనాంబురుహంబున భూమిదేవ వం
శంబును, బాహుదండముల సంగతి రాజకులంబు, నూరుకాం
డంబుల వైశ్యజాతిఁ, జరణంబుల శూద్రగణంబు, నక్షియు
గ్మంబునఁ జంద్రసూర్యుల నఖండగతిన్ సృ[4]జియించి, వెండియున్.

63


క.

నాసాముఖమధ్యమమున | వాసవముఖహరిదధీశవర్గముఁ, బ్రాణో
ల్లాసమున గాడ్పు, ముఖని | శ్వాస[5]సమీరమునఁ బక్షిసర్పాదికమున్.

64


సీ.

వరుసఁ [6]గేశంబుల వాహినీస్తోమంబు, | రోమకూపముల [7]నంభోముచములుఁ,
గరరుహంబులఁ దారకాగ్రహనక్షత్ర | తిర్యగాదులు మఱి ధేనుకులము,
సితహాసమునఁ గామయుతసప్తవింశతి | భేదాంకదేవతాబృందములును,
నాసికఁ బితృదేవతాసమూహంబును, | రోషాతిశయమున రుద్రసమితిఁ


తే.

గూర్మి నిర్మించి, నిర్మాణకర్మపాట | వంబుఁ దనుఁ దాన మెచ్చి, సర్వంబుఁ జూచి ,
యాత్మమూర్తి సముద్భూతయైన మాయఁ | బిలిచి యిట్లని పలికె గంభీరఫణితి.

65
  1. వినుతింపఁగ - క
  2. జంతుకోటి కెల్లను నుదరా - తీ
  3. యునుజిద్రూప - తి,తీ,ర
  4. సృజియించె నత్తఱిన్ - తీ
  5. మున సమీరపక్షి - తీ
  6. దేశంబుల - త
  7. నంభోధిచయము (యతి?) - త; నంభోధరములు (యతి?) - మ,మా,హ, క