పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

121


సీ.

నినుఁ గాళ[1]రాత్రి [2]యంచు నుతింతు భువనేశ్వ | రీశక్తి యనుచు వర్ణింతు నిన్నుఁ,
[3]గౌమారి యని నిన్నుగణుతింతు, వైష్ణవి | యని నిన్ను [4]నెపుడుఁ గీర్తనమొనర్తు,
వారాహి యని నిన్ను వాక్రుత్తు, సర్వమం | గళ యని నిను వచోగరిమ [5]నుడుదు,
[6]బ్రహ్మాణి యని నిన్నుఁ బ్రస్తుతి గావింతు, | సావిత్రి యని నిన్ను [7]6సన్నుతింతు,


తే.

జనని! నిను దుర్గ యనుచుఁ బేర్కొని భజింతు, I సర్వలోకనమస్కృతచరణపీఠ
యనియు, నఖిలార్థదాయిని యనియు నిన్ను | సంతతముఁ గొల్తుఁ గల్యాణి! చంద్రవదన!

51


క.

ఈదుర్గాస్తవ మెప్పుడు | సాదరబుద్ధిం బఠించు సరసులు, సుతపౌ
త్రాదులతోడ సుఖస్థితి | మేదిని యేలుదురు బంధుమిత్రప్రియులై.

52

వైష్ణవీమాయ సాక్షాత్కారము

వ.

అని యిట్లు కొనియాడిన వనజాసనుని వినుతుల కనుమతించి, [8]జగన్మోహా
విధాయినియు నిత్యానపాయినియు నగు వైష్ణవమాయాదేవి కాకోదరరాజశయనునయన
[9]జలజంబులవలన వెలువడి చెలువంబగు లలనారూపంబు గైకొని, కలంకు లేని కొలంకున
నందంబులగు కెందమ్మివిరుల సిరులకుం దల్లి బందువులగు చరణతలంబుల దలంబగు
కెంజాయచేత రంజితంబులై, పదనఖంబు లవంధ్యసంధ్యారాగసాగరమౌక్తికాయమాన
తారకాసఖంబులై చెలువొందఁ, గల[10]హంసకేంకారమంత్రరాజంబులకు నోంకారబీజంబుల
చొప్పున నొప్పు మంజీరతారనినదంబులు వేదంబుల నుత్పాదింపఁ, గటితటఘటితకాంచన
కాంచీకలాపకలకలంబు మధ్యమస్థలంబునకై యస్తి నాస్తి వివాదం బొనరింపఁ బుట్టిన
తద్ఘంటికాపరస్పరకోలాహలంబు సొంపున నింపు సంపాదింపఁ, దోరంబగు నీహారంబుచేతఁ
[11]బొదుగుడుపడిన జక్కవకవచెలువంబునఁ [12]జిలువువలిపెంపుఁ[13]గంచెలమెఱుంగున,
మెఱుంగులు తుఱంగలించు వలుదచన్నులకెలంకులం దొలంకు ప్రభాంకురంబులు బాహు
శాఖల నలమికొనుచుండఁ, [14]దత్కుచపర్వతభరం బోర్వక యడంగిననడిమిం బొడగానక
వెదుకులాడునవియుంబోలె రత్నహారంబు లుభయపార్శ్వంబులకుం దూఁగియాడ, స్తన
గోవర్ధనగిరిద్వయంబు లెత్తిపట్టిన [15]మధ్యమాహరి కరదండంబుల నోజ రోమరాజి విరాజిల్ల,

  1. గాళరాత్రి - తి,తీ.క
  2. యందు తీవ్ర
  3. గౌమారి - బ్రహ్మాణి యని హ. ప్ర. లో లుప్తము.
  4. వర్ణ నయే నొనర్తు (యతి?) - మ
  5. నందు - తీ; నుడుతు - మ, మా, తా, గ,క
  6. బ్రాహ్మియటంచు నిన్ - తీ
  7. సంస్మరింతు-మ, మా, తా, తి,హ,ర క
  8. జగన్మోహన - మా, త, తా,క
  9. జలంబుల - మత,క
  10. హంసక్రౌంచ-కలాప మ,మా, తి, తీ,హ,ర, క, ప్ర. లో లుప్తము
  11. బొనుగుపడిన - తీ
  12. జిలుగు-తీ
  13. గంచెలియ-అన్ని ప్ర.
  14. దత్కుచభరం - త
  15. మధ్యమహారికదండ - త,తా; మధ్యమహారకరదండ - మ,మా,హ; మధ్యమాహారి కరదండ-తి, తీ,ర