పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120

వరాహపురాణము


క.

ఘనరాజసమున బ్రాహ్మీ | వనజాక్షియు, సాత్త్వికమున వైష్ణవియుఁ [1]దన
ర్చిన తామసమున రౌద్రియు | ననఁ బరగుచు వొక్క నీవ [2]యంబుజవదనా!

45


తే.

శక్తులందెల్ల నాదిమశక్తి వీవ, | మూర్తులందెల్ల నాదిమమూర్తి వీవ,
హర[3]విరించాదివందితచరణ వగుచుఁ | ద్రిభువనంబును రక్షించు దేవి వీవ.

46


క.

నిఱుపేదలైన, నీపద | సరసిజములు గొలిచిరేని సాగర[4]వేలా
పరివృత[5]విశ్వక్షోణీ | [6]పరివృఢు లగుదురు త్రిలోకపావనచరితా!

47


చ.

ప్రణవము కామరాజము, ప్భంజనబీజము, [7]నిందిరావధూ
మణినిజబీజయుగ్మము క్రమంబున బిందుసమన్వితంబులై
ప్రణుతికి నెక్కఁ, గూర్పనగు భాసురతావకమంత్రము న్మనో
గణితము చేసి శాశ్వతసుఖంబులు గాంతురు సజ్జనోత్తముల్.

48


ఉ.

నీనిజరూపముం దెలియనేరని దుర్మతు లన్యదేవతా
ధీన మనస్కులై తిరిగి, దీపితవైదికకర్మ[8]మార్గమున్
గానఁగలేక, దైహికసుఖంబులకుం బెడఁబాసి, నారక
స్థాననివాసదుఃఖముల దైన్యము నొందుదు రెల్లకాలమున్.

49


సీ.

నిద్రయై యే దేవి నిఖిలభూతంబుల | చేష్టలు [9]మఱపించి చిక్కువఱచుఁ,
దృష్ణయై యేదేవి ధీరతాలతఁ ద్రించి | ధర మానవుల దీనదశకుఁ దెచ్చు,
[10]మాయేంద్రజాలమై పాయక యేదేవి | [11]విశ్వంబునకు భ్రాంతి విస్తరించు,
నాశాస్వరూపిణియై నిల్చి యేదేవి | నను నీషణత్రయపరుని జేయుఁ,


తే.

ద్రిభువనేశ్వరి యగుచు నేదేవి తనరుఁ, | బరఁగ బ్రహ్మాదిసకలరూపములు దాల్చి
యభినుతికి నెక్కు నేదేవి, యట్టి నిన్ను | భక్తి సేవింతు, భావింతుఁ బ్రస్తుతింతు.

50
  1. ననన్ ఘనతాస - మ,మా, తి, తీ,హ,ర,క
  2. యంబుజనేత్రీ-మ,మా,త, తి, తీ,హ, ర,క
  3. విరించ్యాది - త, తా, తీ
  4. చేలా - తీ
  5. వృక్ష - ర
  6. పరివృతు - త, తా; పరిపృథు-మ,మా,తి,హ,ర,క
  7. దేహకాంతియున్, రణవిజయంబు దుర్దశ శరణ్య హుతాశన లక్ష్మియుక్తమున్, బ్రణుకితి-మ,తా,క
  8. మాత్రమున్-మ, తా, తి,హ,ర, క ; సూత్రమున్-తీ
  9. వర్జించి-త
  10. మాహేంద్రజాల - త,తా
  11. విశ్వంబు - యట్టినిన్ను ,తి, తీర,ప్ర, లో లుప్తము