పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

వరాహపురాణము


చ.

హరి, నిజజన్మ[1]కర్మచరితామృతపాన మొనర్చు దాసులన్
బరమపదంబుఁ జేర్చుటకుఁ బల్మఱు ధాత్రి జనించుఁగాక, దు
స్తరబలగర్వకంటకనిశాచరకాననముల్ హరింపఁ, ద
త్కరక[2]మలాంతరోజ్జ్వలసుదర్శనవహ్నికణంబు చాలదే?

19


మ.

ధర నిక్షేపము, పాల వెన్న, తిలలం దైలంబు, ధారాధరో
దరసీమ న్సలిలంబు, పుష్పముల గంధవ్యాప్తి, బీజాళి నం
కురముల్, దారువులం గృశానుఁ, డిభరాట్కుంభంబుల న్మౌక్తికో
త్కరముం బోలె, నజాండకోటి హరియుం [3]దానుండు సంక్రాంతుఁడై.

20


తే.

ఇందిరాభర్తమాహాత్మ్య మిట్టి దట్టి | దని యెఱుంగఁగనేరక ఖి వేద
[4]వాగురులఁ జిక్కువడి బహుభాగవతుల | తవిలి వర్ణింప, [5]నితరుల తరమె తెలియ?

21


సీ.

మానవుండని భక్తిఁ బూని భావించిన | వారి కారూపమై వరము లొసఁగుఁ,
దేజోమయుండని తెలిసినవారికిఁ | దన్మూర్తియై కాంక్షితంబు లిచ్చు,
నమృతాంశుకోటీరుఁ డని కొల్చువారికి | నట్లయై యిష్టకృత్యము లొనర్చు,
నలినాసనుండని తలఁచినవారికిఁ | దాదృశుఁడై [6]సమ్మదంబు సేయు,


తే.

నిన్నియును నేల యెవ్వరి కెట్లు తోఁచు | నట్టి తెఱఁగున గోచరుండై తదీయ
కర్మకాంతారముల నీఱు[7]గా హరించి | నిముసమున నిల్పు వారల నిజపదమున.

22


క.

అనుమానింప కజాండము | లను బూర్ణుఁడు చక్రి, తత్కళారహితంబై
న నెలవు లేదని తెలిసిన | ఘనపుణ్యుఁడు, పరమపదసుఖస్థితిఁ జెందున్.

23


వ.

అది కావునఁ, బరమపురుషదృక్కోణదర్శనమాత్ర[8]నిర్మితంబులై చతుర్ముఖపంచ
ముఖషణ్ముఖసప్తముఖ[9]దశముఖశతముఖసహస్రముఖవిరించిపాలితంబులగు
బ్రహ్మాండంబు లనంతంబులు గలవు. అందుఁ జతుర్ముఖాధీనంబగు నీబ్రహ్మాండంబున,
నే నెఱింగిన వైష్ణవకథామృతవిశేషంబులు కొన్ని వివరించెద నాకర్ణింపుము.

24
  1. పుణ్య - త
  2. కమలాంతరజ్వల - మ, మా,హ,ర,క
  3. దాగుండు - మ,మా,త,తి,హ,ర
  4. పటలముల - త, తా; వలయమున - మా; పృథుల జంకెడివార లీయుర్విమీద
    దవిలి (యతి?) - క
  5. లేరింకఁ దరమె తెలియ - తీ
  6. సమ్మతంబు - త
  7. నాహరించి (యతి?) - తీ
  8. నిర్జితంబు - తా
  9. దశముఖ - మా, త. ప్ర.పాఠము