పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

115


క.

గురువుల నమరుల ధాత్రీ | సురులను ధేనువుల నదుల సుస్థిరభక్తిన్
హరిరూపములుగఁ దలఁచిన | నరుఁ డేఁగుం బరమపదమునకు మునివర్యా!

13


సీ.

ఎన్ని బ్రహ్మాండంబు లన్నింటి కందఱు | బ్రహ్మలై హరి సృష్టిభరము పూను,
నెన్ని పాతాళంబు లన్నింటి కందఱు | [1]భోగీంద్రులై శౌరి భూమిఁ దాల్చు,
నెన్ని స్వర్లోకంబు లన్నింటి కందఱు | జంభారులై చక్రి జగము లేలు,
నెన్ని కైలాసంబు లన్నింటి కందఱు | భర్గులై శార్ఙ్గి ప్రపంచ మణఁచు,


తే.

నెవ్వఁ డేరూపమునఁ దన్ను నెఱుఁగఁగోరు | వాని కారూపమునఁ గానవచ్చుచుండు,
భక్తజనవత్సలత్వతత్పరుఁడు గాన | భక్తిమంతుల కతఁ డిచ్చుఁ బరమపదము.

14


మ.

అవతారంబు లనేకకోట్లు గల, వాయాబ్రహ్మకల్పంబునన్
భవశక్రాదినుతప్రచారుఁ డగుచున్ బ్రహ్మాండమధ్యంబునన్
వివిధాకారముల న్వహించి, త్రిజగద్విఘ్నంబుల న్మాన్ప సం
భవముం బొంది, మురారి క్రీడ సలుపు న్మత్స్యాదిరూపంబులన్.

15


ఆ.

సర్వ[2]వేదమయుఁడు, సర్వాంతరస్థాయి, | సర్వభూతమయుఁడు, [3]సర్వసముఁడు,
సర్వవైరిహరుఁడు శాశ్వతుం, డవ్యయుఁ, | డచ్యుతుండు ప్రోచు నఖిలజగము.

16


మ.

ఘనవిద్యాకులరూపసంపదలచే గర్వించి [4]మోహాంధతం
దనుఁ జింతించు వివేక మేమఱిన భక్తశ్రేణి బోధించి, యా
త్మనివాసస్థితి సౌఖ్యమిచ్చుటకునై , ధాత్రీస్థలిం బుట్టి యా
వనజాక్షుండు జగంబుఁ బ్రోచు వివిధవ్యాపార[5]పారీణుఁడై.

17


క.

భువనేశుఁడు శాసింపఁగ | నవివేకము దొఱఁగి, [6]దుర్మదాంధత్వముఁ బా
సి, వనట నొందక [7]మనుజుల్ | [8]ధ్రువమగు హరిపదముఁ జెందుదురు మునితిలకా!

18
  1. భోగేంద్రులై - మ,త,తా, తి, తీ,హ,ర,క
  2. దేవ - మా; భూత - ర
  3. శాశ్వతుండు, మునుల సురల నరుల ముదముతో గోవుల, నవ్యయుండు బ్రోచు - క
  4. మోహాంధకుల్ - తి, తీ,క ; మోహెూద్ధతుల్ - త
  5. మేపారగన్ - తీ
  6. దుర్మదాంధత లేకన్, భువివనటబాసి మనుజులు - మ, తి,హ,ర, క ; దుర్మదాంధత విడి యీభువి - తీ
  7. యమరుల్ - మా
  8. ధ్రువముగ - మ,హ,ర,క