పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

వరాహపురాణము

ఆశ్వాసాంత పద్య గద్యములు

చ.

[1]వర[2]నుతశౌరిపాద[3]రత! నవ్య[4]సుధోత్తమసత్యభాషణా!
పరహితభూరిమోద[5]యుత! భవ్య[6]బుధోత్తమనిత్యపోషణా!
స్మరనిభదేహ! పుణ్యగణమాన్య[7]నృపాలయశోభివర్తనా!
[8]వరశుభగేహ! గణ్యగుణ[9]వైన్యనృపాలయశోభి[10]కీర్తనా!

312


క.

వాణీమరాళగంగా | వేణీనీహార[11]హీరవిధుమణిముక్తా
శ్రేణీనిర్మలదీధితి | పాణింధమకీర్తిధామ భాగ్యోద్దామా!

313


మాలిని.

సువిభవపురుహూతా! శుద్ధవంశాభిజాతా!
నవరసికవరేణ్యా! నమ్రవిద్విట్ఛరణ్యా!
భువనహితచరిత్రా! భూసురస్తోత్రపాత్రా!
సవితృసదృశతేజా! సర్వధీమత్తసుజా!

314

గద్యము

ఇది శ్రీహనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణీతనూజాత, అష్టఘంటావధానపరమేశ్వర బిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీతం
బైన వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. ఇది గోమూత్రికాబంధము
  2. నత - తీ; సుత - తి,ర; నుతి - త
  3. నత - ర; రస - క
  4. సురద్రుమ - తా; సుధారమ - మా; సురాసుర - మ
  5. హిత - తి,తీ
  6. వరాదర - తీ
  7. కృపాల-మా
  8. పర - మ,మా,హ,క
  9. దైన్య (యతి?) - మ,క
  10. కీర్తితా - త
  11. హార - తీ