పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

111

కనకకశిపువిదళనము

చ.

ఎదురెదురేఁగి దైత్యవరుఁ డేచినకోపముతోడ మిక్కిలిం
గదిసి, భయంబు లేక, నిజఖడ్గము పూని, నృసింహమూర్తిపై
నదటున వేయఁజూచుటయు, నంతకుమున్న రమావిభుండు త
త్పదములుఁ జేతులుం బెనఁచి పట్టి, చలింపఁగనీక యుగ్రతన్.

305


క.

[1]తొడ లను వధ్యశిలాస్థలిఁ | బడవైచి, నఖంబు లను కృపాణంబులచే
వడివడిని [2]వ్రచ్చి ప్రేవులు | తొడిమలుకూడంగఁ ద్రెంచి దుర్వారుండై.

306


మ.

కరపాదప్రముఖాఖిలాంగకములన్ ఖండించి, దైత్యేశ్వరుం
బరలోకంబున కన్పి, తద్రుధిరకుంభత్సేచనప్రాప్తి బం
ధురకోపాగ్ని శమించినం, ద్రిదశ[3]నాథుం గాంచి, కారుణ్యని
ర్భరవీక్షానికరంబునం దనుపుచుం, బ్రహ్లాదు నగ్గింపుచున్.

307


ప్రహ్లాదరాజ్యపట్టాభిషేకము

క.

[4]రారమ్మని, నిజచరణాం | భోరుహభక్తాగ్రగణ్యుఁ బుణ్యు నతని ర
క్షరాజ్యభద్రపీఠస | మారూఢుని జేసె దివిజు లానందింపన్.

308


క.

కావున సంఖ్యాతీతము | లై వెలసిన హరిగుణముల నభినుతి సేయం
గా, వాణీవల్లభముఖ | దేవావళికైన నరిది ధీమద్వినుతా!

309


రామకృష్ణావతారకథ

సీ.

అంత, రెండవజన్మమందు రావణకుంభ | కర్ణులై భుజపరాక్రమము మెఱసి,
లంకాపురంబు నిశ్శంకఁ బాలింపుచు, | బలవన్నిలింపుల భంగపఱచి,
తుద రఘురామచంద్రుని చాపభవసాయ | కాగ్నికి శలభంబు లైరి, మఱియు,
మూఁడవ సంభవంబున శిశుపాలుండు | దంతవక్త్రుం [5]డనఁ దనరి, వాసు


తే.

దేవశితచక్రధారలఁ ద్రెంపఁబడిరి, | పిదప నిజ[6]శాపముక్తులై విదితమహిమ
జయుఁడు విజయుండు వైకుంఠసదనమునకుఁ | బూర్వమూర్తులు గైకొని పోయి రనఘ!

310


వ.

[7]అని పలికి.

311
  1. ఒడలను - మ,మా,తి,హ,రక
  2. గ్రుచ్చి - తా
  3. సుస్తోమంబు - మా
  4. ఈ ప. మా. ప్ర లో లుప్తము
  5. డనా - తీ
  6. చాప - తి
  7. ఈ వ. తి, తీ, ప్ర.లో లుప్తము