పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

వరాహపురాణము


తే.

కండ్లపస చూపి కామినీగణము వోలెఁ | బరుషవిషమాస్త్రవేదన పాలుపఱుపఁ
గల మనోగతి బెడిదంబుగా [1]వెలుంగు | దైత్యనాయకుసేనారథప్రజంబు.

298


తే.

నీలలోహితమూర్తులు, శూలధరులు | నుగ్రవేషులు నగుచు దైత్యాగ్రగణ్యు
వీరయోధులు మూర్తీభవించినట్టి | రౌద్ర[2]రసమనఁ బొల్తు రున్నిద్రమహిమ.

299


వ.

ఇ ట్లనన్యసామాన్యంబగు సైన్యంబుతో హిరణ్యకశిపుయాతుధానప్రముఖుండు [3]కుమా
రాభిముఖుండయి చనునెడ ముందట.

300


నరసింహావిర్భావము

క.

[4]ప్రళయానల[5]సన్నిభమై | [6]జలజాధిపకోటికోటిసంకాశంబై
యిల నొకతేజఃపుంజము | కలయఁగ దిశలెల్లఁ గప్పి కనుఁగొనఁబడియెన్.

301


మ.

మెఱుఁగుంగోబిల నిప్పుకల్ దొరుఁగ, నామ్రేడీకృతారావ[7]ని
ష్ఠురయై జిహ్వ నటింప, నూర్పుల గిరిస్తోమంబు లూఁటాడఁ, గ్రో
ధరసావేశము నేత్రము ల్దెలుప, నాదైత్యేంద్రు ఖండింపఁగా
నరసింహాకృతి దాల్చి, యందు వెడలె న్నారాయణుం [8]డుగ్రుఁడై.

302


ఉ.

ఇ ట్టతిఘోరమూర్తి నుదయించి, సురాసురదుర్నిరీక్షుఁడై
నట్టి నృసింహదేవుని భయంకరలోచననిర్యదగ్నిసం
ఘట్టనమాత్ర [9]నద్భుతముగాఁ బరిదగ్ధములయ్యె దైత్య రా
ట్పట్టణహర్మ్యగోపురసభాగృహకోశ[10]గృహాదు లన్నియున్.

303


ఉ.

ఆతెఱఁగెల్లఁ గాంచి, దనుజాగ్రణి [11]కోపకషాయి[12]తాస్యుఁడై
యీతఁడువో! మదీయరిపుఁ, - డీతఁడువో! జలజాలయామనో
నేత, నృసింహుఁడైన యితనిన్ బలిచేసెదఁ జుట్టుముట్టి, నా
హేతి[13]కరాళకాళికకు నిప్పుడ నందనువెఱ్ఱి మానఁగన్.

304
  1. మెలంగు - త
  2. రసమున - అన్ని ప్ర.
  3. విహారాభి - మా; పరాభి - మ; వారాభి - తి,ర
  4. ప్రళయానిల - అన్ని ప్ర.
  5. సంభవమై - మ,మా,త,తి,తీ,హ,ర; సంభ్రమమై-క
  6. జలజాహిత - అన్ని ప్ర.
  7. నిష్ఠురమై - తీ
  8. డుద్దతిన్ - తీ
  9. నుద్ధతము - తా; దుత్తుఱుము-మ,తి,తీ,హ,ర,క
  10. భువనాదు - క
  11. రోష-తీ
  12. తాక్షుడై - తీ; తాత్ముఁడై - హ
  13. కరాళికాశిఖికి - తి,తీ