పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

వరాహపురాణము


మ.

అని, ప్రహ్లాద[1]కుమారుఁ డట్టు లభయుండై, వార్ధికన్యాధవున్,
వనజాక్షున్, దనుజాంతకున్, మురహరు న్వర్ణింప, నాకింకరుల్
ఘనరోషానల[2]దీపితాస్యు లగుచున్ గర్జించి, యాపుణ్యవ
ర్తనుపై వేసిరి, ఖడ్గశూలశితకుంతక్రూరబాణాదులన్.

270


చ.

అసురభటప్రయుక్తమగు నాశితశస్త్రచయంబు దైత్యరా
జసుతుని వజ్రసారమగు చారుశరీరము దాఁకి, చూర్ణమై
వసుమతి రాలెఁ గాని, యొకవంకయు [3]నొంపఁగలేకపోయె, నా
బిసరుహబాంధవుం దిమిరబృందము లోపునె యాక్రమింపఁగన్?

271


ఉ.

ఆయుధసంప్రయోగము నిరర్థక మౌట [4]నెఱింగి, క్రవ్యభు
ఙ్నాయకకింకరుల్ సమదనాగనికాయము లాకుమారుపై
నాయతశక్తి దీకొలుప, నాద్విరదంబులు నొక్కపెట్టఁ [5]
త్కాయము దూఁటి, యాక్షణమ ఖండితదంతము లయ్యె నన్నియున్.

272


తే.

దంతములు విర్గి యపుడ దంతావళంబు | లాఁడుపోఁడిమిఁ గైకొని చూడ నొప్పెఁ,
బురుషకుంజరుఁ డనుచు నాపరమపుణ్యు | డాయవచ్చిన కరిణినికాయ మనఁగ.

273


చ.

క్రమమున నంతఁ బోక యసురప్రభుకింకరు లుగ్రకృష్ణస
ర్పములఁ బ్రచండతం గఱవఁబంచిన, దానవరాట్కుమారు గా
త్రముఁ గబళించి, తత్ఫణులు రక్తము గ్రక్కుచుఁ బాఱె, నట్ల, సం
భ్రమమునఁ దార్క్ష్యవాహనుని భక్తులఁ బాములు [6]నొంపఁజాలునే?

274


ఉ.

పాయక దైత్యు లిట్లు బహుభంగుల బాధలొనర్ప “విష్ణుదే
వాయ నమో, [7]నిరంతవిభవాయ నమో, జలజాలయాకళ
త్రాయ నమో, నిశాచరహరాయ నమో" యనుఁ గాని, క్రవ్యభు
గ్నాయకనందనుండు చలనంబునఁ బొందఁ డొకించుకేనియున్.

275


క.

స్మరణ మొనర్చిన నంతః | కరణములో నెగులు దీర్చు కమలాక్షశ్రీ
చరణము; తన్నామస్తుతి | కరణము వెలివంత మాన్పఁగలుగుట యరుదే?

276
  1. కుమారధీరుఁడ - మ; కుమారకుం డభయుఁడై యా - తి,తీ,హ,ర,క; డప్పు డభయుండై - మా
  2. పీడితాస్యు - క
  3. నొవ్వఁగ - మ,హ,ర,క; నోర్వఁగ - త; నెవ్వగ - తి,తీ
  4. యు నల్గి - మా,త
  5. నాకాయము - మ,తా,తి,తీ,హ,ర,క
  6. నొవ్వ - తీ
  7. యనంత - తీ