పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105

సుకుమారకుమారుని రూపుమాపఁ గుపితపిత యానతి

శా.

లోకానీకము సంచలింప, దనుజు ల్భూషింప శూరుండనై
నాకౌకఃపతిముఖ్యదిక్పతుల సన్నాహంబుతో గెల్చి, యి
ట్లేకచ్ఛత్రముగా, నజాండభవనం బే నేలఁగా, వీఁడు ల
క్ష్మీకాంతుండు జగద్విభుం డనుచు నాక్షేపోక్తులం బల్కెడిన్.

263


ఉ.

న్యాయ[1]పథంబు దప్పి, కులనాశకుఁడై జనియించె వీఁడు, దే
వాయతనంబుఁ గూల్చుటకునై యుదయించిన రావి వోలె, నా
రాయణుఁ డెన్న మద్విమతుఁ, డాకుటిలాత్ముని [2]గొండచేసి, మే
ధాయుతుఁడై నుతించె వస ద్రావిన[3]యట్లు నిరర్థకోక్తులన్.

264


ఆ.

ప్రకృతి [4]బంధుఁ డయ్యు బగవానిఁ గూడిన | వాఁడు పగతునట్ల వధ్యుం డండ్రు
కాన, వీనిఁ బట్టి మీ నేర్చుతెఱఁగులఁ | దునుముఁ [5]డిపుడు రాజతనయుఁ డనక.

265


వ.

అని యానతిచ్చిన దానవరాజు నాజ్ఞం దలమోచి, తత్కింకరులు రోషభయంకరు
లగుచుఁ బ్రహ్లాదుని బురబహిరంగణమునకుం దిగుచుకొని, వధ్యశిలామధ్యంబున
నుపవిష్టుం జేసి.

266


క.

కలుషించి దైత్యనాథుఁడు | నిలుపోపక మమ్ముఁ బిలిచి నినుఁ దునుముటకై
సెలవులు మూఁడు నొసంగెను | దలఁపుము నీయిష్టదైవతంబుఁ గుమారా!

267


వ.

అనినఁ, బ్రహ్లాదుండు దైత్యుల కిట్లనియె.

268


విష్ణుభక్తి మహిమ

శా.

గోవిందుండన నొప్పు నెవ్వఁడు, జగత్కూటస్థుఁ డెవ్వాఁడు, వి
శ్వావిర్భావవివర్ధనక్షయకరవ్యాపారుఁ డెవ్వాడు, నా
నావేదస్తవనీయుఁ డెవ్వఁడు, చిదానందాత్ముఁ డెవ్వాడు, నా
దైవం బాజలజోదరుం, డతనిఁ జిత్తంబందు భావించెదన్.

289
  1. పదంబు - త,తా
  2. గొప్ప - త
  3. చిల్క - క
  4. బంధుఁడైన - మా,తా,హ,ర; బద్ధుఁడైన-క
  5. డితఁడు - ర