పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101


లయగ్రాహి.

నీరజభవాదినుతు, ఘోరరిపుసంహరుఁ, బ
        యోరుహవిలోచను, నపారగుణరాశిన్,
హారచయభూషితుఁ, గృపారససమన్వితు, సు
        రారి[1]వనపావకుని, భూరమణనాథున్,
దారుణసుదర్శనవిభారుచిరహస్తు, నవ
        నీరదసమానరుచిపూరితనిజాంగున్,
మేరునగధీరుని, రమారమణు, భక్తసుర
        భూరుహముఁ గొల్చెద ననారతము భక్తిన్.

236


చ.

అనవుడుఁ, గర్ణరంధ్రముల నగ్నిశిఖాపరితప్తశూలముల్
చొనిపినయట్లు మిట్టిపడి, చూపుల నిప్పులు రాల, హుంకృతి
ధ్వనుల నభంబు వ్రీల, భయదంబగు రౌద్రము మూర్తిదాల్చెనో
యనఁ, గడునుగ్రుఁడై, దితిసుతాగ్రణి విప్రులఁ గాంచి యిట్లనెన్.

237


హిరణ్యకశిపుని యాగ్రహోదగ్రత

ఉ.

బాలుఁడు వీఁడు, బుద్ధిపరిపాకవిదూరుఁడు, విష్ణువర్ణనా
మూలములైన పద్యములు మూర్ఖత మీ రెఱిఁగింపకున్న, నే
పోలిక నేర్చు? నాపగతుఁ బూని నుతించునె మత్సుతుండు? శా
ర్దూలకిశోరకంబు మృగధూర్తపరాక్రమమున్ గణించునే?

238


క.

పౌరోహిత్యమిషంబున | నారాయణుపనుపుఁ బూని, నను వంచింపన్
గోరి, యిట కరుగుదెంచిన | వైరులు గా కిట్టి విప్రవరులుం గలరే?

239


ఉ.

నావుడు, దైత్యనాథువచనంబుల వేఁడిమి కోర్వలేక, భూ
దేవ[2]కులాఢ్యు లిట్లనిరి, దేవ! భవత్సుతుఁ డేడ నేర్చెనో
శ్రీవిభువర్ణనం, బిది విచిత్రము, మాసములోన నీతి వి
ద్యా[3]విదుఁ జేసి, నీమదికి హర్ష మొనర్చెద, మంపు క్రమ్మఱన్.

240


ఆ.

అని ప్రతిజ్ఞ పలికి, [4]దనుజేంద్రనందను | వెంటఁ దోడుకొనుచు విప్రు లరిగి,
సంతతంబు నీతిశాస్త్రంబుఁ జదివింపు | చుండి, రంతలోన నొక్కనాఁడు.

241
  1. దవపావకుని - మ,మా,త,తి,తీ,హ,ర,క
  2. కుమారు - తీ
  3. నిధి (ప్రాస?) - తా
  4. యసురేంద్ర - క