పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

వరాహపురాణము


మ.

దనుజాధీశ్వరుఁ డిట్టి వర్షదినముల్ ధారాధరశ్రేణి [1]జో
రని వర్షింపుచునుండ నూర్ధ్వవదనుం డై, నిర్నిమేషావలో
కనుఁడై, యున్నతగండశైలశిఖరాగ్రంబందుఁ గౌపీనమా
త్రనిరూఢాంబరుఁడై, యొనర్చెఁ దపమున్ ధారాళయత్నంబునన్.

217


వ.

[2]తదనంతరంబ,

218


సీ.

అహముల దీర్ఘత్వ మంతయు నుడివోయె, | నమృతాంశురుచిజాల మవచమాయె,
నీహారములు లోకనికర మాచ్ఛాదించెఁ, | జలి పేదజనముల సంహరించి,
ధనదదిశామారుతంబులు చెలరేఁగె, | [3]దక్షిణాయనమునఁ దపనుఁ డేఁగె,
నుష్ణంబు భామాపయోధరంబులఁ జేరె, | నెండపై జనులకు నింపుమీఱె,


తే.

గర్భగృహవాసముల భోగిగణము లణఁగెఁ, | గణఁకఁదాంబూలములు చవి గాఁగఁ
దొణఁగెఁ,
బట్టుచేలంబు లొకకొంత భయముఁ బాపె, | శీతకాలంబు నిజగుణఖ్యాతిఁ జూపె.

219


క.

తరుణీజన[4]వక్షోజ | స్థిరగిరిదుర్గముల దండఁ జేరకయున్నన్
దరమె చలిచేత బ్రదుకఁగ | హరిహరపంకేరుహాసనాదుల కైనన్.

220


చ.

అనఁగ భయంకరంబగు హిమాగమకాలమునందు, ఫాలలో
చనుఁ దనబుద్ధిఁ గీల్కొలిపి, చల్లనికుత్తుకబంటినీటిలో
[5]న నశనుఁడై, నిమేషరహితాక్షిసమీక్షితనాసికాగ్రుఁడై
దనుజుఁడు బాహ్యము న్మఱచి, తన్మయుఁడై తప మాచరింవఁగన్.

221


క.

వత్సరసహస్ర మరిగినఁ | దత్సమయమునందు నతని తపమున నుత్ప
న్నోత్సాహుఁ డగుచు గిరిజా | వత్సలుఁ డేతెంచి, దనుజవర్యుని మ్రోలన్.

222


పరమశివానుగ్రహము - వరప్రదానము

వ.

లోచనగోచరుండై, 'నిశాచరవల్లభ! భవదాచరితతపశ్చర్యాపరితుష్టుండనైతి. తావకా
భీష్టంబు లొసంగెద వేఁడు' మనిన యష్టమూర్తికిం బ్రణుతివిశేషంబుల సంతోషం బొనర్చి,
శేషభూషణువలన సమేళితవివిధభోగకృత్యంబగు త్రైలోక్యాధిపత్యంబును, దేవగంధర్వ

  1. భోరున (యతి?) - త,తా,క; బోరన - మా
  2. ఈ వ.తి,ర, ప్ర.లో లుప్తము
  3. దక్షిణా - చవిగాఁగఁదొణఁగె హ.ప్ర.లో లుప్తము
  4. వక్షోజద్వయ (ప్రాస?) - త
  5. న,నచలుఁడై (యతి?) - మ,తి,తీ,హ,ర,క