పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95


మ.

సురలోకంబున భూసురోత్తమ! బుధస్తుత్యుండవై, నిర్జరీ
సురతక్రీడలఁ గాలముం జరుపఁగాఁ జోద్యంబు నీ కొక్కవా
సరమై తోఁచి, సహస్రవర్షము లవిజ్ఞాతంబులై పోయె, దు
స్తరశోకంబునఁ బొందు మింకొకఋతుద్వంద్వంబు దీనాకృతిన్.

198


చ.

అని సమవర్తి పల్కిన, మహాద్భుత మంది సబాష్పనేత్రుఁడై
తనమదిఁ [1]దాప ముప్పతిల, దైవము దూఱుచు, ఘోరకింకరా
సనములు గాంచి బెగ్గిలుచు, నాకనివాసులు చూచుచుండఁగాఁ
జనియె నతండు రౌరవనిశాంతముఁ జేరఁగ నెట్టకేలకున్.

199


వ.

ఇట్లు కాలకింకరానీతుండై, యమలోకంబున కరిగిన విష్ణువర్ధనుం గదిసి, తత్కింకరులు
కాలసూత్రంబున ముంచియుఁ, గాలానలజ్వాలాజాల[2]నఖంబులును, లోహముఖంబులునగు
ఖగంబులచేతఁ గఱపించియు, నిర్వాతజ్వలనకీలా[3]సంరంభంబులగు సంతప్తాయసస్తంభంబుల
నంటఁగట్టియు భంగద లగు గదలం గొట్టియు, నిశితాసిపత్రవనమధ్యంబులం ద్రోసియు,
శూలంబుల వ్రేసియుఁ, దప్తతైలంబులం ద్రోచియు, సంఘాతాదినారకంబుల [4]వ్రేఁచియు
నొప్పించిన, యాతనాదేహసంశ్రితుండై [5]నిమేషపరిమితంబగు కాలంబు వత్సరశతంబుగాఁ
దలంచి, పాపపరిపాకంబగు శోకం బనుభవింపుచు, నొక్కనాఁడు భయంకరులగు కింకరుల
నాక్షేపించి, నిరయక్షేత్రంబు బలాత్కారంబున నిర్గమించి, దండధరుపాలి కుద్దండతం జని
యిట్లనియె.

200


ఆ.

సర్వసమతఁ బొంది సమవర్తివై నీవు | జీవకోట్ల కెల్లఁ జేసినట్టి
పాప[6]ఫలముఁ గుడుపఁ బాల్పడి, నాయెడ | నసమవర్తి వైతి వనఘచరిత!

201


క.

ఋతుయుగళభోగ్య[7]దురితా | స్వతు నన్ను, సహస్రవర్షనిష్ఠురదుఃఖ
ప్రతిహతుని జేయఁదగునే? ! ప్రతిపక్షుఁడ వగుచు నిట్లు పద్మాప్తసుతా!

202


క.

కరుణించి నన్నకారణ | విరసత్వము మాని కావవే! యని పలుకన్,
దరహాసవికచవదనాం | బురుహుండై , యముఁడు విప్రముఖ్యున కనియెన్.

208
  1. బాప ము - మా
  2. సంఘంబు - మ,మా,తి,హ,ర,క
  3. సంభవంబులను - మా
  4. నుంచియు - త
  5. నిమిషపరీతం - తా
  6. భయము - మా
  7. వనితా - మ,తి,హ,ర,క