పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

వరాహపురాణము


క.

మెచ్చితిఁ దావకతపమున | కిచ్చెద ధరణీసురేంద్ర! యిష్టార్థములన్
విచ్చలవిడి నడుగుము యు | ష్మచ్చతురవచో[1]విశేషసంపద మెఱయన్.

180


చ.

అని హరి యానతిచ్చిన, [2]ధరామరముఖ్యుఁడు [3]సంతసించి, వం
దన మొనరించి, హస్తనళినంబులు మౌళి నమర్చి యిట్లనున్;
వనరుహనేత్ర! సర్వజనవర్ణిత! మాధవ! చక్రి! నాకు నీ
యనుపమలోక మిమ్ము కరుణాన్వితవీక్షణ! భక్తరక్షణా!

181


సీ.

నావుడు, మేదినీదేవపుంగవునకు | నిందిరాధవుఁ డరవిందనాభుఁ
డతిభక్తితోడ నిట్లనియె, విప్రోత్తమ! | నీకు నేనూఱేండ్లు నిరయమందు
బహుదుఃఖములు పొందఁ బ్రాప్తంబు గల, దవా | ర్యంబులు కర్మఫలంబు లరయ,
మద్భక్తుఁడవు గాన, మాసమాత్రము రౌర | వాదిమహాదుఃఖ మనుభవించి,


తే.

భోగనాశ్యంబులైనట్టి [4]పూర్వ[5]కర్మ | జాలములఁ [6]3ద్రెంప వైష్ణవజన్మ మంది,
ధరణి సంసారభయదూర తరుఁడ వగుచు; | దత్పరతఁ [7]జేరెదవు మీఁద మత్పురంబు.

182


వ.

అని దేవదేవుం డానతిచ్చిన, భూదేవవరుండు తదాజ్ఞానియుక్తుండై, యొక్కమాసంబు
మదీయలోకంబున ననూనశోకం బనుభవించి, భూతలంబున వైష్ణవజాతుండై, యనంత
రంబున వైకుంఠనగరప్రాప్తుం డయ్యె. కావున, నీవును యాతనాతనుసమేతుండవై, యొక్క
వత్సరంబు కుత్సితనిరయంబుల దురితఫలం బనుభవించి, యటమీఁద సుకృతపరిపాకాతి
రేకంబున నాకలోకంబున సహస్రవర్షంబులు హత్కర్షంబు నొంది, క్రమ్మఱం బుడమిం
బొడమి, యల్పకాలంబునన శేషతల్పుపదంబున ముదంబు నొందెదవని పల్కిన యుష్ణాంశు
నందనునకు విష్ణువర్ధనుం డిట్లనియె.

183


సీ.

సమవర్తివై మున్ను సకలజీవులకును | గర్మమూలమున సంక్రాంతమైన
పాపపుణ్యచయంబు భాగించి యధికాల్ప | రూపతత్త్వమ్ములఁ జూపి వరుస
ననుభవింపఁగ బంచి, యంత భూతలమున | నెట్టి[8]కర్మంబుల కెద్ది జన్మ
మది నిర్ణయించి, మర్యాదతో జీవన | కర్మమోహాదులఁ - గలుగఁజేసి,


తే.

నీవు నియమింపఁ, బ్రాణు లాత్రోవ నడచి | జన్మమరణాంధకారసంఛన్ను లగుచుఁ
దలఁపనెఱుఁగరు హరి నాత్మ దండధారి! | [9]కలుషనిచయనీరస్త! లోకప్రశస్త!

184
  1. విలాస - తా
  2. ధరావర - మ,త,తా,తి,తీ,హ,ర,క
  3. వేడ్కనంత-మ,తి, తీ,హ,ర,క; సమ్మతించి - మా
  4. పుణ్య - త
  5. జన్మకర్మములు ద్రెవ్వ (యతి?) - మా
  6. ద్రిప్ప - మ,హ,ర,క
  7. జెందెదవు - క
  8. జన్మంబున నెట్టికర్మ - తీ
  9. ఇది తీ. ప్ర. పాఠము; ఇతర ప్ర. లో లుప్తము.