పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

89


తే.

కర్మబహువల్లికాసమాక్రాంతుఁ డగుచు | దారుణంబైన సంసారభూరుహంబు
భూరిసుజ్ఞాననిశితకుఠారధార | నెలమి ఖండించి, హరిపురి కేఁగవలయు.

159


ఉ.

అచ్చెరు వంద నేల? విను, మద్భుతకర్ముఁడు చక్రి, యాత్మ నా
మోచ్చరణైకమాత్రము సముత్సుకుఁడై యొనరించువానికి
న్మెచ్చి యొసంగు ముక్తి, నిది నిక్క, మెఱింగియు దేహధారియై
చచ్చుచుఁ బుట్టుచుం దిరుగు జంతువుఁ గన్గొని నవ్వువచ్చెడిన్.

160


చ.

తనువు ధరించి జీవుఁడు సుతప్రమదాముఖవస్తుమోహవ
ర్ధనమునఁ గన్నుగానక, విరాజితసాత్త్వికదానదూరుఁడై,
యనుపమవేదమార్గజడుఁడై, భవనాశనమోక్షలాభసా
ధన హరిధర్మము న్విడిచి, తత్త్వ మెఱుంగక యుండు మూఢుఁడై.

161


వ.

ఇంక నొక్కయితిహాసంబు చెప్పెద నాకర్ణింపుము.

162


విష్ణువర్ధనోపాఖ్యానము

సీ.

బలభేదనం బనుపట్టణంబునఁ దొల్లి | విష్ణువర్ధనుఁ డను విప్రవరుఁడు
ధర్మసత్యజ్ఞానదాక్షిణ్య[1]యుక్తుఁడై | యఖిలశాస్త్రంబుల నభ్యసించి,
సంతతానుష్ఠానసంపన్నుఁడై , శత్రు | షడ్వర్గజయమునఁ జాల వెలసి,
యనుకూలభార్యాసహాయుఁడై , సాత్త్విక | దానంబు సేయుచుఁ దత్ఫలంబు


తే.

హరికి నర్పించి, వైష్ణవధ్యానయోగ | చతురుఁడై, యన్నదానంబు జరుపుచుండి,
యచలితశ్రీసమేతగృహంబునందు | మండలాధీశమాన్యుఁడై యుండి యతఁడు.

163


మ.

సురకల్లోలినిఁ దీర్థమాడఁ[2]గ మనస్తోషంబుతో నొక్కనాఁ
డరుగన్, భూసురముఖ్యుఁ డొక్కరుఁడు తృష్ణానల్పదాహక్షుధా
తురుఁడై, యింటికి వచ్చి యన్న మడుగన్, దుర్వారసంపన్మదా
కరతన్, [3]బెట్టద విష్ణువర్ధన3సుధీకంజాక్షి దుష్టాకృతిన్.

164


ఆ.

అంతఁ, గొంతకాల మరిగినతుద విష్ణు | వర్ధనుండు కాలవశగుఁ డగుచు
దేహయష్టి వదలి, దేవేంద్రపురమున | కరిగె నమరసంఘ మభినుతింప.

165
  1. వంతుఁడై - త
  2. గడుసంతోషంబు - తా
  3. బెట్టక - మ,మా,తి,తీ,హ,ర,క