పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

వరాహపురాణము


తే.

వినుము [1]మోక్షార్థియైనట్టి విమలమతికి | భాగవతభక్తి మదిలోనఁ బాదుకొల్పి,
కమలనాభార్పితాఖిలకర్ముఁ డగుచు నుంట యుచితంబు, వెండియు నొకటి వినుము.

151


క.

నర[2]కాంతవర్తులకు, భా | సురలోకవిహార[3]శుభకీర్తులకుం
[4]రిణామంబునఁ గాలము | సరిగా వర్తించుచుండు సన్మునివర్యా!

152


క.

ఆకాలమె ఘనదుఃఖ[5]సు | ఖాకరమై నిడుపు గుఱుచ లై తోఁచును, దే
హాకీర్ణభావగుణ మది | ప్రాకట్య[6]మ మెఱయఁ దెలియఁబడ దెవ్వరికిన్.

153


క.

సముదితదుఃఖాన్వితులకు, | సముదంచితభోగసౌఖ్య[7]సంపన్నులకున్
గ్రమమునఁ [8]దోఁచుచునుండును | నిముసం బేఁడగుచు, నేఁడు నిముసం బగుచున్.

154


తే.

పక్షమాసర్తువర్షానుభవ[9]వినాశ్య | పాపపుణ్యఫలంబు సంప్రాప్తమగుచు
ననుభవింపంగఁబడుచుండు, నధికసూక్ష్మ | కాలమునఁ జేసి జీవసంఘంబుచేత.

155


ఆ.

పాపపుణ్యకర్మఫలము జీవుఁ డనుభ | వించి పిదప సంభవించు, విశ్వ
ధరణిమండలమునఁ దనకుఁ బ్రాప్తవ్యమై | నట్టి యుచితవిగ్రహమును దాల్చి.

156


వ.

ఇ ట్లనుభూయమానంబులగు [10]కర్మంబులు సంచితంబులు, ప్రారబ్ధంబులు నన రెండు
తెఱంగులు. అందుఁ బూర్వజన్మార్జితంబులై రాశిభూతంబులగు కర్మంబులు సంచితంబులు.
భవిష్యజ్జన్మంబులక్రమంబున ఫలోన్ముఖంబులైన కర్మంబులు ప్రారబ్దంబులు.అట్టి
కర్మంబులు పుణ్యపాపభేదంబున ద్వివిధంబులై యుండు. నందు స్వర్గభోగ్యంబులు
పుణ్యకర్మంబులును, నిరయభోగ్యంబులు పాపకర్మంబులునై సుఖదుఃఖజనకంబు లగుచుఁ
బ్రవరిల్లుచుండు. కావున.

157


చ.

పురుషుఁడు దేహియై ధరణిఁ బుట్టి, ప్రబోధము గల్గి, తత్త్వముం
గురు[11]వదనంబున న్విని, ముకుందుఁడ కర్మ[12]వినాశకుండుగా
నెఱుఁగి, యధర్మమార్గమున నేఁగక, వైష్ణవభక్తుఁడై, మనో
హరసుచరిత్రుఁడై, భగవదర్పితనిర్మలకర్మజాలుఁడై.

158
  1. వరభూషణార్తియౌ - క; భూషణార్తియై - మా
  2. కాంతావర్తులకును సుర - మ,మా,త,తి,హ,ర,క
  3. సుర - మ,మా,తి,హ,ర,క
  4. బరమాణం - మ,మా,త,తా
  5. శుభాకర - తి,హ
  6. ముమేర - మా
  7. సన్మానులకున్ - మా
  8. వర్తిలు - క
  9. వినాశ - మ,తి,హ,ర,క
  10. కర్మంబు-జనకంబు మా.ప్ర.లో లుప్తము
  11. వచనం- మ,త,తా,తి,హ,ర
  12. సునాశకుం - మ,మా