పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

85


సీ.

కృతయుగంబున భాగవతులకు మారుత | పూరణక్రియల నేపుణ్య మబ్బుఁ,
ద్రేతాయుగంబున శ్రీవధూవిభుఁ గూర్చి | తప మాచరింప నేధర్మ మొదవు,
ద్వాపరంబున యాగతంత్రాదికర్మముల్ | జరుప నేసుకృతంబు సంభవించు,
[1][2]మహితమౌ చతురాశ్రమస్వీక్రియావశ | మ్మున నేఫలంబు విస్ఫూర్తి నొందు


తే.

నట్టి పుణ్యాదికము, పంకజాక్షుమధుర | నామకీర్తనమాత్రంబునం జనించుఁ
గాన, యుగములయందెల్లఁ గలియుగంబు | భక్తకోటి కనాయాసముక్తిదం[3]బు.

133


వ.

మఱియుఁ గర్మయోగంబును, ధ్యానయోగంబును, భక్తియోగంబు నన, ముక్తిప్రాప్తి
కారణంబులు మూఁడు గలవు. అందుఁ గామ్యనిషిద్ధంబులు వర్జించి, నిత్యనైమిత్తిక
కర్మంబులు భగవత్ప్రీతిగా నాచరించుట కర్మయోగంబు. యమనియమాసనప్రాణాయామ
ప్రత్యాహారధ్యానధారణసమాధ్యష్టాంగమ్ములచేత హృదయాంభోరుహకర్ణికామధ్య
మంబునం బరమాత్ముదర్శనం బొనర్చుట ధ్యానయోగంబు. హరిస్థిరబుద్ధి భక్తియోగంబు.
ఈ త్రివిధంబునందు, ధ్యానయోగంబు విస్తరించెద నాకర్ణింపుము.

134


ధ్యానయోగప్రకారము

సీ.

విజనస్థలంబున విమలపద్మాసనా | సీనుఁడై యుండి [4]నిశ్చింతుఁ డగుచు,
వాయువు వశముగా ద్వారముల్ బంధించి | సమ[5]కాయుఁడై మనోజలరుహంబు
ప్రణవంబు [6]చెవిని సాంద్రంబుగా బోధించి, | తద్భవ్యకర్ణికాంతరమునందు
సోమసూర్యాగ్నులసొరిది దొంతరగాఁగ | నిలిపి, యావహ్నిమండలములోన


తే.

భావనాకల్పిత[7]స్వర్ణభద్రపీఠి | కాంతరాళంబునం దిష్టమైన విష్ణు
మూర్తి [8]నిలుపుచుఁ బుత్రాదిమోహ ముడిగి, | సంతతధ్యాన మీరీతిఁ జలుపవలయు.

135


క.

ఏరూపముఁ దనచిత్తాం | భోరుహమునఁ దలఁచు నరుఁడు పుణ్యాకరుఁడై,
యారూపముఁ బొంది యతం | డారూఢుం డగును వైష్ణవాంచిత[9]పదవిన్.

136
  1. మహిత - జనించు తి.ప్ర. లో లుప్తము
  2. కలియుగంబున భక్తికలితులై కీర్తన లొనరించినంతనే యొదవు ముక్తి గాన యుగముల - తీ
  3. బు జపతపాద్యాయసత్క్రియా చరణనిపుణ సన్మునివరేణ్యులకుఁ బారిజాతకంబు - తీ
  4. నిశ్చిత్తు - మ,మా,హ,ర,క
  5. రాయు - మ; వాయు - తీ; దాయు - క
  6. చే వినిద్రంబుగా - త,తి
  7. స్వర్గ - తి,తీ
  8. దలఁపుచు - మా,త,తా,తి,తీ,క
  9. పదమున్ - అన్ని ప్ర.