పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

వరాహపురాణము


శా.

సాలగ్రామశిలార్పితప్రసవమున్ సద్భక్తిసంపన్నుఁడై
మౌళిం దాలుచు నెవ్వఁడేని యతఁ డస్మల్లోకముం [1]దాఁటి, జం
ఘాలుండై చని, విష్ణు[2]లోకమున సౌఖ్యంబందుఁ, బద్మాలయా
కేళీసౌధసమీపకాంచనమయక్రీడానివాసంబునన్.

78


క.

ప్రేమదలిర్పఁగ సాల | గ్రామశిలామధ్యమమునఁ [3]గదలక యుండుం
దామరసాక్షుఁడు, గావున | నామణి పూజార్హమయ్యె నమరమునీంద్రా!

79


మ.

లలితజ్ఞానధురీణ! యెచ్చటను సాలగ్రామరత్నంబు శో
భిలు, నచ్చో దివిజాపగాముఖనదీబృందంబు వర్తించు, ను
జ్జ్వలతం దచ్ఛిల [4]యున్ననల్గడఁ జతుశ్చాపప్రమాణావనీ
తల మత్యంతపవిత్రమై, సకలతీర్థశ్రేష్ఠమై పొల్పగున్.

80


క.

[5]విలసితసాలగ్రామో | పలనికటమునందుఁ జక్రపాణిని భక్తిన్
నెలకొలిపి, [6]కుముదకమలం | బులఁ బూజ యొనర్చునతఁడు ముక్తిం జెందున్.

81


సీ.

విప్రహంతయు, దేవవిత్తాపహరణుండు, | సతతపరాంగనాసంగరతుఁడు,
ద్యూతపానక్రియాదురితానురక్తుండు, | పతితుండు, స్వసృమాతృపాతకుండు,
గురునింద యొనరించుకుజనుండు, మూర్ఖుండు, | చండాలభామానుషంగ[7]పరుఁడు,
కులఘ్నుండు, పితృద్రోహి, | నాస్తికుం, డాచారనయవిదూరు


తే.

డైన, నుపవాసనియతుఁడై హరిదినమునఁ | బొసఁగ శ్రీమూర్తి విప్రున కొసఁగెనేని
పుష్పకారూఢుఁడై సర్వపూజ్యుఁ డగుచు | విష్ణుసాయుజ్య[8]మును బొందు విమలచరిత!

82


శా. సాలగ్రామము దానమిచ్చి నరుఁ డీసంసారదావానల
జ్వాలాంతఃపతితుండు గాక, వసుధాసౌఖ్యంబులం బొంది, ది
వ్యాలంకారసమేతుఁడై, నిజశరీరాంతంబున న్విష్ణుతే
జోలీనత్వము నొందుఁ, దూఱఁ డతఁ డిచ్చో మాతృగర్భాటవిన్.

83


చ.

హరికి సమర్పితంబగు వరాన్నమ యొండె, ఫలంబ యొండె, భా
సుర[9]సలిలంబ యొండె, చవి చూచిన, నెట్టిదురాత్ముఁడైనఁ ద
త్పరమపదంబు నొందు; విను పంకజనాభున కర్పితంబులై
పరఁగని వస్తువుల్, శునక[10]పాచకమాంససమంబు లారయన్.

84
  1. జెంది - మా
  2. గేహమున - మ,మా,త,తా,హ,ర
  3. గడయక - మా
  4. యందు - తీ
  5. ఈ ప. తీ. ప్ర. లో లుప్తము
  6. నీలకమలం - మా,త
  7. రతుఁడు - తి,తీ; చరుఁడు - హ,ర
  8. మందును - తీ
  9. పరవస్తువొండె - తీ
  10. పాదజ - ఘ,మా,త,తా; పాచిక - తి,తీ,హ,ర,క