పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

వరాహపురాణము


తే.

సర్వసంగపరిత్యాగచతురుఁ డగుచు | భిక్షువేషము దాల్చి, పద్మాక్షుచరణ
వనజనిర్మలభక్తిసాధనము గాఁగఁ | జెందునది సజ్జనుఁడు హరిమందిరంబు.

61


కర్మయోగరహస్యము

ఉ.

జ్ఞానము కర్మమార్గమున సంజనితం బగుచుండుఁ, దన్మహా
జ్ఞానవిశేషపూర్వముగ సజ్జనవర్యులు కర్మలాభమున్
నూనక చేసి, తత్ఫలము మాధవమూర్తికి నర్పితంబుగాఁ
బూనియొనర్చి, విష్ణుపదభోగము గాంతురు భక్తియుక్తులై.

62


వ.

అట్టి కర్మంబులు నిత్య నైమిత్తిక కామ్య నిషిద్ధంబు లన నాల్గుతెఱంగులయ్యె. అందు
సంధ్యాకృత్యంబులు నిత్యకర్మంబులు. సోమసూర్యగ్రహణాదికాలకర్తవ్యంబులు నైమిత్తి
కంబులు. ఫలవాంఛాసమేతంబులు కామ్యకర్మంబులు. రజస్వలాసంభాషణంబులు
నిషిద్ధంబులు. వీనిలోనం గామ్యనిషిద్ధకర్మంబులు పరిత్యజించి, నిత్యనైమిత్తికంబులు
భగవత్ప్రీతిగా నాచరింపవలయు.

63


క.

ఫలవాంఛ చేసి నిత్యా | దులు భూసురుఁ డాచరించి, దుఃఖాకరుఁడై
యిలఁ బలుమరు జనియింపుచు, | బలవత్సంసారవార్ధిఁ బడును మునీంద్రా!

64


క.

హరినామకీర్తనంబును | హరిపూజాకరణ[1]రతియు హరిభక్తజనా
దరణంబును గావించిన | నరుఁ [2]డేఁగును విష్ణుపదమునకు మునినాథా!

65


విష్ణుపూజాక్రమము

క.

ఆలేఖ్యలోహలేపిత | శైలమనోరత్న[3]దారుసైకతకృతల
క్ష్మీలలనేశప్రతిమా | జాలములో నొకటిఁ బూన్పఁ జను మనుజునకున్.

66


వ.

తత్పూజాప్రకారం బెట్టిదనిన.

67


సీ.

స్నానపూర్వకముగా సంధ్యాదు లొనరించి, | గోమయపరిలిప్తభూమియందు
రంగవల్లీక్రియారమ్యమండపమున | భాసురపీఠంబుఁ బాదుకొల్పి.
పద్మాలయాధవప్రతిమ నచ్చట నిల్పి, | తన్ముఖాసీనుఁడై తలఁపు గలిగి
యందు లక్ష్మీనాథు నావాహనము చేసి, | క్రమమున నర్ష్యపాద్యము లొసంగి,


తే.

సరసచందన మలఁది పుష్పముల నించి | భక్తి మెఱయంగ ధూపదీపము లొసంగి,
బహువిధాన్నంబు లర్పించి ప్రస్తుతించి, | తగు నొనర్పఁ బ్రణామప్రదక్షిణములు.

68
  1. గతియు - మ
  2. డరుగును - తీ
  3. ధాతు - తా,తీ