పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

67

ఆశ్వాసాంతపద్యగద్యములు

శా.

[1]చర్యావార్యమహత్ప్రియవ్రతపరా! శౌరిక్రియా[2]చక్రగా!
వర్యారాధ్యహరి[3]స్ఫురన్మఠ! భుజవ్యాకృష్ణవైరిప్రభా!
ధుర్యాహంకృతి[4]సూక్తి[5]మన్నుతజయద్భూతిక్రమా[6]తంద్రకా!
కార్యాలోచనభావబుద్ధి[7]ధుతరాగా! కీర్తి[8]భామోత్సుకా!

204


క.

[9]రాకాశశాంకహరితా | రాకాశతరంగిణీపురారాతిహిమా
నీకాశకుందచందన | నీకాశయశో౽భిరామ! నృప[10]నయధామా!

205


మాలిని.

సతతవిహితదానా! సత్యభాషానిదానా!
[11]పతిహితగుణధుర్యా! పండితాశ్చర్య[12]చర్యా!
గతదురితసమాజా! గంగమాంబాతనూజా!
మతివిభవకలాపా! మంత్రిపుండ్రేక్షుచాపా!

206


గద్యము.

ఇది శ్రీ హనుమత్కరుణావరప్రసాదాసాదితసారస్వతనిరాతంక, చంద్రనామాంక
రామవిద్వన్మణితనూజాత, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదవిఖ్యాత, హరిభట్టప్రణీతం
బైన వరాహపురాణంబునఁ గైవల్యఖండంబను పూర్వభాగంబునందు ద్వితీయాశ్వాసము.

  1. చక్రబంధము
  2. చక్రిగా - మ
  3. స్మరన్మత - క
  4. శుక్తి - మ,తా
  5. మన్నదయితద్భూతి - హ,ర, క; మన్మచయిత - తి
  6. రప్రకా - తి,హ,ర
  7. ద్రుత - త; మతి - హ; మత - మ,మా,తా,తి,తీ,ర,క
  8. భావోత్సుకా - తా; కావోత్సుకా - తీ; ధామో - క; భౌమో - ర
  9. ఈ ప. తీ.ప్ర.లో లుప్తము
  10. దయ - మ,తా,హ,ర,క
  11. ప్రతి - మా
  12. డుర్యా - మ,హ,ర,క; ధైర్యా - తా; భర్యా - త